Posani Krishna Murali | ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట
Posani Krishna Murali | సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.
Posani Krishna Murali – AP High Court | సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. గతవారం ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోసాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రాగా.. పరిశీలించిన కోర్టు, పోసానిపై తదుపరి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించింది.
ఈ కేసులో సెక్షన్ 111తో పాటు, ఒక మహిళను అసభ్యంగా చిత్రీకరించారనే ఆరోపణలతో పోసానిపై అదనపు సెక్షన్లు చేర్చడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించారంటూ విచారణ అధికారి మురళీకృష్ణపై సీరియస్ అయింది. ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని నిలదీసింది. మురళీకృష్ణకు ఫామ్ 1 నోటీసు జారీ చేసి, రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

