BRS Party | తెలంగాణలో మున్పిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ గద్వాల మున్సిపాలిటీలో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు పెద్ద షాకే తగిలింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు తమ అనుచరులతో కలిసి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ 37వ వార్డు పట్టణ కార్యదర్శి చిత్తారి కిరణ్ వందమంది అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. వీరితోపాటు 24,5వ వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ హనుమంతు నాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.