హైదరాబాద్, ఆట ప్రతినిధి : శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న శ్రీనాథ్ ఆదివారం హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన సహచర విద్యార్థులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం అత్యవసర చికిత్స కోసం దగ్గరలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తమ కొడుకు చావుబతుకుల్లో ఉండటంతో శ్రీనాథ్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న క్రీడా మంత్రి శ్రీహరి దవాఖానకు చేరుకుని విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.