ఆసియాకప్ విజేత యువభారత్.. ఫైనల్లో బంగ్లాపై ఘన విజయం
ఏసీసీ మహిళల ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యువ భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రాధాయాదవ్ నేతృత్వంలోని టీమ్ఇండియా 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత తేజల్ హసన్బీస్(51 నాటౌట్) అజేయ అర్ధసెంచరీకి తోడు కెప్టెన్ రాధాయాదవ్(36) రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 134/7 స్కోరు చేసింది.
బ్యాంకాక్ : ఏసీసీ మహిళల ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యువ భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రాధాయాదవ్ నేతృత్వంలోని టీమ్ఇండియా 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత తేజల్ హసన్బీస్(51 నాటౌట్) అజేయ అర్ధసెంచరీకి తోడు కెప్టెన్ రాధాయాదవ్(36) రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 134/7 స్కోరు చేసింది. బంగ్లా బౌలింగ్ ధాటికి ఒక దశలో 44 పరుగులకే నందిని కశ్యప్(8), దినేశ్ వృందా(19), మిన్నుమణి(0), అనుశ్కశర్మ(8) వికెట్లు కోల్పోయిన జట్టును తేజల్ ఆదుకుంది.
రాధాయాదవ్తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పడేసింది. వీరిద్దరు బంగ్లా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ సాధికారిక ఇన్నింగ్స్ ఆడారు. ఐదో వికెట్‌కు 69 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫహిమా ఖాతూన్(4/25) నాలుగు వికెట్లు పడగొట్టింది. స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా 19.1 ఓవర్లలో 88 పరుగులకు కుప్పకూలింది. ప్రేమ రావత్(3/12), తనూజ కన్వర్(2/11), సోనియా(2/21) బంగ్లా పతనంలో కీలకమయ్యారు. కెప్టెన్ షమీమా సుల్తానా(20) టాప్ స్కోరర్‌గా నిలువగా, మిగతావారు స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. తేజల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

