అహ్మదాబాద్ : ఐపీఎల్ మాజీ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే) అభిమానులకు శుభవార్త! వచ్చే సీజన్లో దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ బరిలోకి దిగుతాడా లేదా అన్న సందిగ్ధతపై ఒకింత స్పష్టత వచ్చింది. త్వరలో మొదలయ్యే ఐపీఎల్లో ధోనీ అందుబాటులో ఉంటాడని సీఎస్కే యాజమాన్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే లీగ్‌లో అన్ని మ్యాచ్‌లు ధోనీ బరిలోకి దిగేది లేనిది తేలాల్సి ఉంది.
ఈ ఏడాదితో 45వ పడిలోకి ప్రవేశిస్తున్న మహీ గత కొన్నేండ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దీనికి తోడు వయసు మీద పడటంతో గతంలోలాగా రాణించలేకపోతున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ జడేజాను రాజస్థాన్‌కు బదిలీ చేసి సంజూ శాంసన్‌ను తీసుకున్న సీఎస్కే ఎవరి సారథ్య బాధ్యతలు అప్పగిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. జట్టులో శాంసన్‌తో పాటు ఉర్విల్పటేల్, కార్తీక్‌శర్మ రూపంలో మరో ఇద్దరు వికెట్కీపర్లు ఉండటం చెన్నైకు కలిసి రానుంది. ఇదిలా ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోనీని ఉపయోగించుకునే యోచనలో చెన్నై ఉన్నట్లు తెలుస్తున్నది.