న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోటపై వందేమాతరం ప్రతిధ్వనించనున్నది. 80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాల వేళ.. మొట్టమొదటి సారి వందేమాతర గేయాన్ని ఎర్రకోటపై ఆలపించనున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే సంబరాల్లో ఆ గేయాన్ని పాడనున్నారు. రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా కూడా ఈ ప్రత్యేక గీతాలాపన చేపట్టనున్నారు. ప్రధాని మోదీ ఆ రోజు ఎర్రకోటకు చేరుకోగానే.. జాతీయ గేయాన్ని ఆలపిస్తారు. ఆ తర్వాత ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆ తర్వాత దేశాన్ని ఉద్దేశించిన మోదీ ప్రసంగిస్తారు. ఈసారి యువశక్తి ఫోకస్‌తో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను నిర్వహించనున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యంతో సాగే ఉద్యమోంలో భారత యువ జనాభా ఆ దిశగా తన సహకారాన్ని అందించనున్నది.
ఇటీవలే పార్లమెంట్లో వందేమాతరం గేయంకు సంబంధించిన బిల్లును పాస్ చేశారు. ఆ చట్టం ప్రకారం.. వందేమాతరం గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. కొన్నిసార్లు జరిమానా కూడా విధిస్తారు. వందేమాతరం పాడేటప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా, అడ్డుకున్నా కూడా శిక్షార్హులే. వందేమాతరం రాసి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ బిల్లును, ఆ గేయానికి గౌరవ సూచకంగా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. బంకించంద్ర ఛటర్జీ తొలుత 1875లో వందేమాతరం గేయాన్ని రచించారు. తర్వాత తన ఆనంద్‌మఠ్ నవలలో ఆ గేయాన్ని చేర్చారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ ప్రభుత్వం వందేమాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించింది.
#WATCH | Delhi: As part of the 80th Independence Day celebrations, for the first time ever, the National Song ‘Vande Mataram’ would be sung from the ramparts of Red Fort
Defence Secretary RK Singh says, “This is the first time we are doing it with that sequence. The sequence is… pic.twitter.com/Ugj7UwPBQs
— ANI (@ANI) August 10, 2026