Madhya Pradesh | స్థానికులు చెప్పినా వినని డ్రైవర్.. కాలువలో కొట్టుకుపోయిన వ్యాన్.. 9 మంది మృతి
Madhya Pradesh : ఒక వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం ఏకంగా 9 మంది ప్రయాణికుల ప్రాణాలు తీసింది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ కాలువలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.
Madhya Pradesh : ఒక వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం ఏకంగా 9 మంది ప్రయాణికుల ప్రాణాలు తీసింది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ కాలువలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని సారంగపూర్ పట్టణ పరిధిలో సోమవారం ఉదయం 9.00 గంటలకు జరిగింది. మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక చోట్ల నదులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. సారంగపూర్ పట్టణ పరిధిలోని పడానా బైపాస్ మార్గంలో ఒక కాలువ ఉంది. భారీ వర్షాల కారణంగా ఈ కాలువ సోమవారం ఉప్పొంగింది.
దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కాలువకు రెండు వైపులా స్థానికులు, కొందరు అధికారులు కూడా ఉండి పరిస్తితిని పర్యవేక్షించారు. ఇదే సమయంలో ఒక వ్యాన్ ఈ మార్గంలో వచ్చి కాలువ దాటేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడ ఉన్న స్థానికులు అది సాధ్యం కాదని వ్యాన్ డ్రైవర్‌కు చెప్పారు. కాలువలో నీరు ఉప్పొంగుతోందని, వ్యాన్‌తో వెళ్తే ప్రమాదం అని, కొట్టుకుపోయే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. అప్పటికే ఆ వ్యాన్‌లో 11 మంది ప్రయాణికులున్నారు. కానీ, ఆ వ్యాన్ డ్రైవర్ వారి మాటల్ని వినిపించుకోలేదు. ఎంత ఉప్పొంగినా కాలువ దాటగలననే మూర్ఖత్వంతో వ్యాన్‌ను కాలువలోంచి పోనిచ్చాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత భారీగా వస్తున్న నీటి వేగానికి ఆ వ్యాన్ కాలువలో కొట్టుకుపోయింది. స్థానికులు చూస్తుండగానే, క్షణాల్లో వ్యాన్ నీటిలో పడి కొట్టుకుపోసాగింది. ఈ క్రమంలో అందులోని ఇద్దరు ఎలాగోలా బయటపడి, తమనుతాము రక్షించుకున్నారు.
వెంటనే గమనించిన స్థానికులు కూడా ఈ ఇద్దరితోపాటు మిగతావారిని రక్షించే ప్రయత్నం చేశారు. తమ ప్రాణాలకు తెగించి స్థానికులు.. తాళ్లతో వారిని గాలించే ప్రయత్నం చేశారు. ఇద్దరిని ఒడ్డుకు చేర్చగలిగారు. అప్పటికే వ్యాన్ చాలాదూరం కొట్టుకుపోయింది. వ్యాన్‌లోని 9 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ బృందాలు, స్థానికుల సహాయంతో తొమ్మిది మంది మృతదేహాల్ని వెలికితీశారు. వ్యాన్‌ను కూడా బయటకు తీసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై సారంగపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ మాట వినిపించుకోని డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

