హెచ్చరిక బోర్డు ఓకే – ఆక్రమణలపై చర్యలేవి?
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై గత కొద్ది సంవత్సరాల నుండి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కోట్లాది విలువైన భూములను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు అట్టి స్థలాలలో ప్రభుత్వ స్థలాలుగా...
– అనేక సందేహాలకు తావిస్తున్న అధికారుల చర్యలు
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 16 : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై గత కొద్ది సంవత్సరాల నుండి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కోట్లాది విలువైన భూములను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు అట్టి స్థలాలలో ప్రభుత్వ స్థలాలుగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు సర్వే నంబర్ 142లో ఆక్రమణలకు గురి అయ్యిందని భావించిన మండల రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డును ఆ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. స్థానిక జిపిఓ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జిపిఓ లు బోర్డును ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్వే నెంబర్ 142లో సుమారు మూడు ఎకరాల భూమి, దాదాపు రూ.15 కోట్ల విలువ ఉంటుందని, ఈ ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారని తిరిగి తాము స్వాధీనం చేసుకుని బోర్డు పెట్టడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇకనుంచి ఈ స్థలంలో ఆక్రమణ చర్యలు పాల్పడితే చర్యలు తీసుకుంటామని జిపిఓ కోటేశ్వరరావు హెచ్చరించారు.
అక్కడో తీరు – ఇక్కడ తీరు
మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. అయితే ఇదే సమయంలో స్థానికుల నుండి పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ స్థలంకు కూత వేటు దూరంలో గత కొద్ది నెలల క్రితం రెవెన్యూ అధికారులు గిరిజన వ్యక్తులు కొందరు అసైన్డ్ ల్యాండ్ ని ఆక్రమణ చేశారని అట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకుని బోర్డును పెట్టారు. ఆ ప్రదేశంలో సదరు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్ జెసిబిల సహాయంతో తొలగించారు. వారు నాటుకున్న మొక్కలను సైతం పూర్తిగా ఆనవాళ్లు లేకుండా తొలగించడం జరిగింది. అయితే బుధవారం స్వాధీనం చేసుకున్న స్థలంలో ఫెన్సింగ్ జోలికి వెళ్లకుండా, ఆ స్థలంలో వివిధ నిర్మాణాలు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా కేవలం హెచ్చరిక బోర్డును శాశ్వతంగా కాకుండా. మట్టిలో ఉంచి వెళ్లడం పలు సందేహాలకు తాగిస్తుంది. అనేకమార్లు ఆక్రమణలకు పాల్పడినట్లు తెలిపిన అధికారులు వారిపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చర్చ జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు ప్రైవేటు నిర్మాణాలను తొలగిస్తారా లేక వేచి చూసే ధోరణి కనబరుస్తారా అనేది వేచి చూడాల్సిందే.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

