Aasmaan | శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ వచ్చేసింది.!
Aasmaan | దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి వారసుడిగా ఆయన కుమారుడు మేఘాంశ్ హీరోగా పరిచయం అవుతున్న తాజా చిత్రం ‘ఆస్మాన్’.
Aasmaan | టాలీవుడ్ దివంగత నటుడు శ్రీహరి తనయుడిగా సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి శ్రమిస్తున్న యువ నటుడు మేఘాంశ్ శ్రీహరి తాజాగా మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ‘ఆస్మాన్’ (AASMAAN) సినిమా టీజర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ పతాకంపై శ్రీమతి కొండారు శ్రీనివాసరావు సమర్పణలో కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్లు ఇప్పటికే మంచి బజ్ సృష్టించగా, తాజాగా హీరో మేఘాంశ్ శ్రీహరి జన్మదినం సందర్భంగా విడుదలైన టీజర్ సినిమా స్థాయిని మరింత పెంచేలా ఉంది.
టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఒక మిస్టరీ థ్రిల్లర్‌లా సాగింది. ముఖ్యంగా టీజర్లో వినిపించిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. “మీరు ఇప్పుడు గొంగలి పురుగు దశలో ఉన్నారు.. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి.. దానికి మార్గం నేనే.. మీరందరూ కూడా కనిపించే చీకట్లో ఉన్నారు.. అదే నిజం” అంటూ హీరో చెప్పిన వాయిస్ ఓవర్ మరియు డైలాగ్స్ సినిమాలోని డెప్త్‌ను తెలియజేస్తున్నాయి. కేవలం డైలాగ్స్ మాత్రమే కాకుండా, టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, అలాగే ఎమోషనల్ లేయర్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా డిజైన్ చేశారు. అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్న ఈ గ్లింప్స్‌లో మేఘాంశ్ శ్రీహరి సరికొత్త మేకోవర్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సాంకేతిక నిపుణుల పనితీరు కూడా ఈ సినిమాకు ప్రధాన బలంగా మారనుంది. ప్రశాంత్ ఆర్ విహారి అందిస్తున్న నేపథ్య సంగీతం, షోయబ్ సినిమాటోగ్రఫీ టీజర్‌కే హైలైట్‌గా నిలిచాయి. పూర్తి స్థాయి యాక్షన్ మరియు ఎమోషనల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ మరియు అరబిక్ భాషల్లోనూ పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మేఘాంశ్ శ్రీహరి సరసన రాయంచ నటిస్తుండగా.. రవివర్మ, కమల్, కేశవ్ దీపక్, నిఖిల్, రాజశేఖర్, పద్మిని, ప్రేరణ గ్యాంగ్, సంతోష్, రమణ, కుమార్, మరియు ప్రముఖ నటుడు సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ వ్యవహరిస్తుండగా, శ్రీమతి కొండారు శ్రీనివాసరావు సమర్పిస్తున్నారు. కొండారు వెంకటేష్, మన్నెం శ్రీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, రామ్నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. షోయబ్ కెమెరా బాధ్యతలు నిర్వర్తించగా, మణికంఠ ఆర్ట్ డైరెక్టర్‌గా, స్వప్న కొండారు సీఈవోగా సేవలందిస్తున్నారు. నరేష్ ఎడిటర్‌గా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీత దర్శకుడిగా పనిచేస్తుండగా, ధని ఏలె పోస్టర్ డిజైనర్‌గా వ్యవహరించారు. పీఆర్వో బాధ్యతలను నాయుడు – ఫణి చూసుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

