చెన్నై: డీఎంకే నేత, తమిళనాడు మాజీ విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్‌పై అవినీతి కేసు బుక్కైంది. గ్రేటర్ చెన్నై పోలీసులు ఆ కేసు నమోదు చేశారు. ఇవాళ చెన్నైతో పాటు తిరుచ్చి , మరో ఆరు ప్రదేశాల్లో ఒకేసారి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల(Private Schools) గుర్తింపు కోసం కోట్లల్లో అవినీతి జరిగినట్లు కేసులో పేర్కొన్నారు. తమిళనాడులో ప్రైవేటు స్కూళ్ల సమాఖ్యకు కార్యదర్శిగా ఉన్న ఇళంగోవన్ ఫిర్యాదు చేశారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల నుంచి ఓ ముఠా డబ్బులు వసూల్ చేసిందని, ప్రభుత్వ అనుమతులు, శాశ్వత గుర్తింపు, అప్‌గ్రేడేషన్, డీటీసీపీ క్లియరెన్స్ కోసం అక్రమ రీతిలో ప్రైవేటు స్కూళ్ల నుంచి అక్రమ రీతిలో వసూల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఫిర్యాదు ఆధారంగా సీసీబీ కేసు నమోదు చేసి, నిందితుడు బీటీ అరాసకుమార్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని గూంఢా చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ కేసుకు సంబంధించి 250 మందిని ఎంక్వైరీ చేసినట్లు తెలుస్తోంది. బూటకపు హామీలపై 177 ప్రైవేటు బడుల నుంచి కోట్లాది రూపాయలు వసూల్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుడి బ్యాంక్ అకౌంట్, అతని కుటుంబం వివరాలను గుర్తించారు. అరాస్కుమార్కు చెందిన 20 అకౌంట్లను సీజ్ చేశారు.
మరో నిందితుడు ముత్తు కుమార్‌పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసుల్లో సబ్మిట్ చేసిన పిటీషన్లు, ఫైనాన్షియల్ రికార్డులు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ డివైస్‌లను స్వాధీనం చేసుకున్నారు.