Railway Jobs | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) CEN 05/2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 590 పారామెడికల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను ప్రకటించింది. నర్సింగ్ సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్, ఇన్స్పెక్టర్ తదితర తొమ్మిది విభాగాల్లో నింపనుంది. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యింది. అర్హులు, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు – ఖాళీలు
నర్సింగ్ సూపరింటెండెంట్- 365
ఫార్మసిస్ట్ (Entry Grade)- 118
డయాలిసిస్ టెక్నీషియన్- 1
ఈసీజీ టెక్నీషియన్- 4
ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II- 31
రేడియోగ్రాఫర్ ఎక్స్‌రే టెక్నీషియన్- 25
హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్-III- 43
ఆప్టోమెట్రిస్ట్- 2
ఆడియోలాజిస్ట్ అండ్ స్పీచ్ థెరపీ- 1
సికింద్రాబాద్ జోన్‌కు 71 పోస్టులు కేటాయించారు.
సంబంధిత పోస్టుల ఆధారంగా అభ్యర్థులు నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని ఆర్ఆర్బీ సూచిస్తుంది.

Rrb Posts
అర్హతలు
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీతో పాటు డిప్లొమా ఉతీర్ణత సాధించాలి. అలాగే కొన్ని పోస్టులకు సైన్స్ సబ్జెక్టులతో 12వ తరగతి సైన్స్‌తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, DMLT చేసి ఉండాలి.
వయసు
నర్సింగ్ సూపరింటెండెంట్‌కు 20 నుంచి 40, డయాలిసిస్ టెక్నీషియన్‌కు 20 నుంచి 33, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ఈసీజీ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్లకు18 నుంచి 33, ఆడియోలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ 21 నుంచి 30, ఫార్మాసిస్ట్‌కు 20 నుంచి 35, రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్‌కు 19 నుంచి 33 ఏండ్లలోపు ఉండాలి.
ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, ఎక్స్ సర్వీస్మెన్లకు కేటగిరీని బట్టి 3 నుంచి 8, దివ్యాంగులకు కేటగిరీని బట్టి 10 నుంచి 15 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు
దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 500 (CBT పరీక్షకు హాజరైనవారికి రూ. 400 రీఫండ్ చేస్తారు). ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీలకు రూ. 250 (CBT పరీక్షకు హాజరైనవారికి మొత్తం రీఫండ్ చేస్తారు).

Rrb Apply
ఎంపిక
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు.
పరీక్ష 100 మార్కులకు (ప్రొఫెషనల్ ఎబిలిటీ 70, జనరల్ అవేర్నెస్ 10, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 10, జనరల్ సైన్స్ 10) ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కు కోత విధిస్తారు.
ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ. 21,700 నుంచి 44,900 జీతం ఉంటుంది.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యింది. అక్టోబర్ 14తో ముగుస్తుంది. ఇతర వివరాలకు వెబ్సైట్లు https://indianrailways.gov.in, rrbapply.gov.inలో చూడండి.