మొగుళ్ల పల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముల్కపల్లి – మొగుళ్ళపల్లి గ్రామాల మధ్య మినీ మేడారం ( Mini Medaram ) జాతరను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు( MLA Satyanarayana Rao) బుధవారం ప్రారంభించారు. పెద్ద వాగు ఒడ్డున ప్రకృతి ఒడిలో జరిగే సమ్మక్క సారలమ్మ తల్లుల దయతో ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, జాతర కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు . అనంతరం జాతరలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్, సీసీ కెమెరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో జాతర కమిటీ అధ్యక్షులు ఆలూరు గంగాధర్ రావు ,ప్రధాన కార్యదర్శి చదువు అన్నారెడ్డి, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో సురేందర్ గౌడ్, వైద్యాధికారి డాక్టర్ నాగరాణి, ఏ ఈ స్వాతి , సర్పంచులు చాట్ల విజయ రవీందర్, నాంపల్లి శ్రీవాణి రమేష్ చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రఫీ, తక్కళ్ల పల్లి రాజు, వివిధ శాఖల అధికారులు జాతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.