AA 23 Announcement Video | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా (AA23) షూటింగ్ మొదలవ్వకముందే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన 23 Theme సాంగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ థీమ్ సాంగ్ విడుదలైన అతి తక్కువ కాలంలోనే 3.5 లక్షలకు పైగా రీల్స్ రావడం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా నిలిచింది. కేవలం సినిమా అనౌన్స్మెంట్ కోసం వాడిన ఒక మ్యూజిక్ బిట్‌కు ఈ స్థాయిలో రీల్స్ రావడం భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే మొదటిసారి అని సమాచారం. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన ఈ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యువతను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా, నెట్టింట ఈ మ్యూజిక్‌ను ట్రెండింగ్‌లో ఉంచింది.
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒక గుర్రంపై వస్తున్న యానిమేటెడ్ విజువల్స్ చూస్తుంటే, ఇది ఒక వెస్ట్రన్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ‘పుష్ప 2’ భారీ విజయం తర్వాత అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తుండగా.. ఈ ప్రాజెక్ట్ అనంతరం లోకేశ్ కనగరాజ్ సినిమా పట్టాలెక్కబోతుంది. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ 2026లో ప్రారంభం కానుంది. అనౌన్స్మెంట్ వీడియోతోనే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లిన ఈ చిత్రం రిలీజ్ నాటికి ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.