హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయినా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది. అన్ని రంగాల వారినీ నమ్మించి మోసం చేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కింది. రైతులకు ఎకరానికి రూ.15 వేల రైతుబంధు ఇస్తానని మాట తప్పింది. పైగా ఇప్పటికే మూడు దఫాలు రైతుబంధు ఇవ్వకుండా ఎగవేసింది. కళ్యాణిలక్ష్మి కింద ఇచ్చే నగదుతోపాటు తులం బంగారం ఇస్తానని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గొప్పలు చెప్పింది. కానీ ఇప్పటికీ తులం బంగారానికి దిక్కులేదు.
ఆసరా పించన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు కోతలు కోశారు. కానీ ఇప్పటికే ఆ హామీని అమలు చేయలేదు. ఆఖరికి రైతులకు యూరియా ఇవ్వడం కూడా ఈ కాంగ్రెస్ పాలకులకు చేతగాలేదు. బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వచ్చింది. హైడ్రాను అడ్డంపెట్టుకుని ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లను ఈ సర్కారు కూలగొడుతోంది. వారిని మానసిక క్షోభకు గురిచేస్తోంది. అంతేగాదు ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేలు జరుగలేదు. దాంతో అందరిలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. అందుకే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో జనం కాంగ్రెస్ గట్టి గుణపాఠం చెప్పారు.
హామీల సంగతి పక్కన పెడితే.. రాష్ట్ర రాజధాని నగరంలో చెరువుల పర్యవేక్షణ కూడా ఈ ప్రభుత్వానికి చేతగావడం లేదు. కాంగ్రెస్ సర్కారు పర్యవేక్షణాలోపంతో హైదరాబాద్లోని చెరువులన్నీ పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయాయి. ఎల్బీనగర్ మంత్రాల చెరువు, జిల్లెలగూడలో చందన చెరువు, నాచారం HMT నగర్ చెరువు, మాదాపూర్లోని దుర్గం చెరువు మొదలైనవి నగరంలోని చెరువులు దుస్థితికి కొన్ని ఉదాహరణలు. దాదాపు అన్ని చెరువులు మురికికూపాలుగా, కాలుష్య కాసారాలుగా మారాయి. ఇవే చెరువులు కాంగ్రెస్ అధికారంలోకి రాకమునుపు బ్రహ్మాండంగా ఉండేవి. కాంగ్రెస్ పాలనలో పర్యవేక్షణాలోపం కారణంగా ఇప్పుడు చెరువులన్నీ నాశమైపోయాయి. ప్రస్తుతం నగరంలోని చెరువుల దుస్థితిని కింది వీడియోల్లో మీరు కూడా చూడవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం పర్యవేక్షణ లోపంతో పూర్తిగా గుర్రపుడెక్కతో నిండిపోయిన ఎల్బీనగర్ మంత్రాల చెరువు, జిల్లెలుగూడ చందన చెరువు https://t.co/yuGw2hMCfw pic.twitter.com/oOYm4Fmrvs
— Telugu Scribe (@TeluguScribe) January 28, 2026
నాచారం – HMT నగర్లో పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయిన చెరువు https://t.co/fjdzHGMgMx pic.twitter.com/8vZxtidN9x
— Telugu Scribe (@TeluguScribe) January 27, 2026