CPI (ML) | జూలూరుపాడు, ఫిబ్రవరి 13 : ఆరు గ్యారంటీల (Six Guarantees) అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఈనెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ జూలూరుపాడు బస్టాండ్ సెంటర్లో పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
అనంతరం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, ఐఎఫ్ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే ఉమర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా.. ‘ఇంటింటా సౌభాగ్యం ఇందిరమ్మ ఇల్లు’ అంటూ హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదన్నారు. పెరిగిన పెన్షన్లు ఇవ్వలేదని, అర్హులైన పేదవారికి రేషన్ కార్డులు ఇవ్వలేదని, రైతు భరోసా, రైతు బంధు, గృహలక్ష్మి,మహాలక్ష్మిఅనేక పథకాలు పెట్టి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని అన్నారు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ప్రగల్బాలు పలికిన ఈ ప్రభుత్వాలు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వారు గుర్తు చేశారు. ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా పరిష్కరించలేదని ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న చేపట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జూలూరుపాడు మండల కార్యదర్శి వల్లోజుల రమేష్,వెంకయ్య,వెంకటేశ్వర్లు,మాధవరావు,రమేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం