మెహిదీపట్నం ఫిబ్రవరి 13 : ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఫుట్ పాత్ (Footpath encroachments) ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు గురువారం కూల్చివేశారు(Demolition). లంగర్ హౌస్ డివిజన్లోని రాందేవ్ గూడలో ప్రధాన రోడ్డును ఆక్రమించుకుని కొందరు దుకాణాలను నిర్వహిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో గురువారం జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సర్కిల్ 13 సెక్షన్ ఆఫీసర్ ప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి, ఎస్ఐలు సమీ ఉజ్, ప్రేమ్ రాజ బందోబస్తు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Konda Surekha | నాగార్జున పరువు నష్టం కేసు… నాంపల్లి కోర్టుకు మంత్రి కొండ సురేఖ
Rakul Preet Singh | జిమ్లో యాక్సిడెంట్.. ఎట్టకేలకు స్పందించిన రకుల్!