Rakul Preet Singh | మన శక్తికి మించి వ్యాయాయం చేయడం ఆరోగ్యపరంగా ఏమాత్రం శ్రేయస్కరం కాదని, ప్రతీ దానికి పరిమితులు ఉంటాయని చెప్పింది కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్. కొద్దినెలల క్రితం వర్కవుట్స్ సందర్భంగా ఆమె వెన్నెముకకు గాయమైంది. దాని నుంచి కోలుకున్న ఈ భామ ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన గాయం గురించి మాట్లాడింది.
‘గాయం తర్వాత ఏ విషయంలోనూ అతి చేయడం మంచిదికాదని అర్థమైంది. నా శరీరంపై గౌరవం పెరిగింది. వ్యాయామం సమయంలో మన శరీరం తన పరిమితి ఏమిటో తెలియజెపుతుంది. అక్కడే ఆగిపోవాలి. మన బాడీ స్టామినాకు మించి వర్కవుట్స్ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయొద్దు’ అని సలహా ఇచ్చింది. గాయం నుంచి కోలుకొని తిరిగి సినిమాల్లో బిజీ కావడం ఆనందంగా ఉందని, ఇక నుంచి కెరీర్‌పై మరింత దృష్టి పెడతానని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. ఆమె అర్జున్‌కపూర్ సరసన కథానాయికగా నటించిన ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.