Akkineni Nagarjuna – Konda Surekha | తెలంగాణ మంత్రి కొండా సురేఖ నేడు నాంపల్లి కోర్టు ముందు హాజరయ్యింది. గతంలో అక్కినేని ఫ్యామిలీపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారణలో భాగంగా నేడు కోర్టుకు వచ్చింది సురేఖ. అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ అగ్ర నటి సమంతతో పాటు, అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దూమారం రేపాయి. అయితే కొండా చేసిన వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా.. ఇవాళ స్పెషల్ జడ్జి ముందు సురేఖ హాజరై వివరణ ఇవ్వనున్నారు.