ఉప్పల్ ఫిబ్రవరి 13 : పిల్లలకు ఆధార్ కార్డులు(Aadhaar cards) ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఉప్పల్ జీహెచ్ఎంసీ ఆఫీస్(,Uppal GHMC Office) ముందు ఓ మహిళ నలుగురు పిల్లలతో సహా ధర్నాకు దిగిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధిత మహిళ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జోగుళాంబ జిల్లా గద్వాల పట్టణం గంజిపేటకు చెందిన కావేరి గత మూడు నెలల క్రితం భర్తతో గొడవపడి నగరానికి వచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. తన నలుగురు పిల్లలతో కలిసి సికింద్రాబాద్ చేరుకున్నారు.
అక్కడ తన బ్యాగులో ఉన్న ఆధార్ కార్డులు పోగొట్టుకుంది. ఆధార్ కార్డులు ఇప్పించాలని పలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ చివరికి ఉప్పల్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంది. అయితే ఇక్కడ ఆధార్ కార్డు ఇప్పించాలంటే పలు సర్టిఫికెట్లు అవసరం అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. కానీ, సదరు మహిళ నాకు ఎలాగైనా ఇప్పించాలని కోరుతూ తన పిల్లలు శ్రీనివాస్, గీత, సంజయ్, దీక్షతో కలిసి కార్యాలయంలో బైఠాయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.