RS Praveen Kumar | రెండేళ్ల రెండు నెలల రేవంత్ పాలనలో విద్యా వ్యవస్థ మీద కుట్రలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీఎంకు విద్యా విధానం మీద నివేదిక ఇచ్చారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే విద్యాకమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేస్తామని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బ తీసే ప్రయత్నం ఈ రిపోర్టులో జరిగింది . లక్షా 70 వేల మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ఉపాధ్యాయుల జీతాలను విద్యాకమిషన్ కాదు నిర్ధారించాల్సింది. పీఆర్సీ నిర్ణయించాలి …ఒళ్ళంతా విషం నింపుకుని ఆకునూరి మురళి ఈ రిపోర్ట్ తయారు చేశారు. ఏ మాత్రం సమీక్షించకుండా పదేళ్ల కేసీఆర్ పాలన లో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని మురళి ఎలా అంటారు ?..లక్షా 70 వేల మంది ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. విద్యుత్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ లతో కేసీఆర్ కృషిని తక్కువ చేసే ప్రయత్నం చేశారు .ఇపుడు విద్యాకమిషన్ రిపోర్ట్ తో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీసే కుట్ర చేశారు.
7900 కోట్లతో మన ఊరు మనబడి కార్యక్రమం తో 25 వేల స్కూళ్లను కేసీఆర్ బాగు చేశారు. గురుకులాల గురించి కేసీఆర్ హయాంలో జరిగిన కృషిని వేరే చెప్పనక్కర్లేదు . మెడికల్ కాలేజీలు ,నర్సింగ్ కాలేజీలు, స్పోర్ట్స్ అకాడమీలు ఇలా ఎన్నో కేసీఆర్ హయంలో ప్రారంభించిన విషయం ఆకునూరి మురళికి కనిపించలేదా
..? విద్యావ్యవస్థ కు రాజకీయాలు జత చేయొద్దని మురళి అంటూనే కేసీఆర్ ను ఎందుకు విమర్శిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పీఆర్సీ ద్వారా ఉపాధ్యాయ, ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచిన ఘనత కేసీఆర్‌దన్నారు.
ఉపాధ్యాయుల జీతాలు పెంచకుండా రేవంత్ రెడ్డి విద్యా కమిషన్‌తో రిపోర్టు ఇప్పించుకున్నారు. ఉపాధ్యాయులకు టెస్టులు పెట్టి ప్రమోషన్లు ఇవ్వాలని మురళి రిపోర్టు ఇచ్చారు. ఐఏఎస్, ఐపిఎస్‌ల ప్రమోషన్లకు టెస్టులు వద్దా.. ?విద్యావ్యవస్థలో ఉన్నత ప్రమాణాలు రావాలంటే ఉపాధ్యాయుల జీతాలు గౌరవప్రదంగా ఉండాలి. ఈ మాటే మేధావులు ఏంతో మంది చెప్పారు..ఇది నిచ్చెన మెట్ల సమాజమని మురళికి తెలియదా..? ఇంజినీరింగ్ ఎంట్రన్స్ రద్దు చేసి ఇంటర్ మార్కుల ద్వారా అడ్మిషన్లు ఇవ్వాలని కమిషన్ ఎలా చెబుతుంది ?ఇంటర్ మార్కుల ద్వారా ఇంజినీరింగ్ సీట్లు అంటే నష్టపోయేది గ్రామీణ ప్రాంత విద్యార్థులు కాదా.. ? కార్పొరేట్ కళాశాలలకు ఈ సిఫార్సు మేలు కలిగించదా ?…ఫీజు రీ ఎంబెర్స్ మెంట్ రద్దు చేయాలని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది.
పేద కుటుంబాల మీద ఎందుకంత కోపం..?
ఇది పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే చర్య..రేవంత్ రెడ్డికి ఫీజు రీ యింబర్స్‌మెంట్ ఇష్టం లేకనే విద్యా కమిషన్‌తో ఆ మాట చెప్పించారు…గురుకులాలు క్రమంగా రద్దు చేయాలని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకే గురుకులాలు రద్దు చేయాలంటున్నారు. డిగ్రీ గురుకులాలు రద్దు చేయమంటున్నారు .ఇంత కన్నా దారుణమైన చర్య ఉంటుందా…? పేద విద్యార్థినుల కోసం డిగ్రీ గురుకులాలు పెట్టారనే విషయం మరిచిపోతున్నారు. దేశంలోనే మొదటిసారి పెట్టిన మహిళా డిగ్రీ గురుకులాలు మంచి ఫలితాలు వచ్చాయి. మురళికి కోపం ఉంటే మమ్మల్ని కాల్చండి. పేద కుటుంబాల మీద ఎందుకంత కోపం..? కేసీఆర్ టీచర్లను మనుషులుగా చూశారు.. నేనే 8 వేల మంది గురుకులాల టీచర్ల నియామకం చేశా..తర్వాత ఘంటా చక్రపాణి గురుకులాల టీచర్ల నియామకం చేశారు..కేసీఆర్ హయాంలో టీచర్ల రిక్రూట్మెంట్ జరగలేదు అని మురళి ఎలా అంటారు. ఉమ్మడి రాష్ట్రం లో ఛిద్రమైన విద్యావ్యవస్థ ను కేసీఆర్ బాగు చేశారు..పౌష్టికాహారం లోపం ఉన్న శిశువును ఇంక్యుబేటర్ లో పెట్టి కాపాడుకున్నట్టే .. కేసీఆర్ విద్యావ్యవస్థను చంటి బిడ్డను కాపాడుకున్నట్టు కాపాడారు..
మురళికి అప్పగించిన బాధ్యత ఏమిటీ..? ఆయన చేసిందేమిటీ.. ?
విద్యాకమిషన్ రిపోర్టులో సిరిసిల్లలో గురుకులాల ఫోటోలు పెట్టారు. గౌలి దొడ్డి ఎక్సలెన్స్ స్కూల్ ను విద్యా కమిషన్ సందర్శిస్తే వాస్తవాలు తెలిసేవి…ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఎందుకు..? ఏ సంక్షేమ గురుకులం అయినా అన్ని వర్గాల విద్యార్థులు కేసీఆర్ హయాంలో ఏమీ చేయకుంటే ఆ ఫోటోలు ఎలా పెట్టారు.. ? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు అనేది లోప భూయిష్ఠమైన విధానం ..అన్నీ బంద్ చేస్తామనే విద్యాకమిషన్ రిపోర్ట్ ఇచ్చింది .ఇట్లా అయితే విద్యా ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి..? ప్రభుత్వ డబ్బును కేసీఆర్‌ను తిట్టడానికి ఎలా దుర్వినియోగం చేస్తారు..? ఎంఈఓలు, డీఈఓ లను డైరెక్ట్ గా రిక్రూట్ చేస్తే ప్రమోషన్లు ఎలా చేస్తారు.. ? విద్యా వ్యవస్థలో ఖర్చు ఎట్లా తగ్గించాలని రిపోర్ట్ ఇచ్చినట్టుంది. మురళికి అప్పగించిన బాధ్యత ఏమిటీ..? ఆయన చేసిందేమిటీ.. ?.
గౌలి దొడ్డి ఎక్సలెన్స్ స్కూల్ ను విద్యా కమిషన్ సందర్శిస్తే వాస్తవాలు తెలిసేవి …ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఎందుకు ..? ఏ సంక్షేమ గురుకులం అయినా అన్ని వర్గాల విద్యార్థులు ఉంటారు .ఇంకా ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఎందుకు.. ? బీసీ సంక్షేమ , ఎస్సీ , మైనారిటీ సంక్షేమ శాఖలు ఎందుకు ? ఒక్కటే ఇంటిగ్రేటెడ్ సంక్షేమ శాఖ పెట్టకపోయారా ? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. …మంత్రులు ఎందుకు ఒక ముఖ్యమంత్రి దగ్గరే అన్ని శాఖలు పెట్టండి …ప్రీ ప్రైమరీ స్కూళ్ల పేరుతో అంగన్ వాడీ సెంటర్లను బంద్ పెట్టే కుట్ర జరుగుతోంది .. …నేషనల్ ఎడ్యుకేషన్ పాలసి ని విద్యా కమిషన్ కాపీ పేస్ట్ చేసింది …విద్యా కమిషన్ సిలబస్ గురించి ఎందుకు మాట్లాడలేదు …అర్థం పర్థం లేని సిఫార్సులతో ఉన్న ఈ విద్యాకమిషన్ రిపోర్టు ను చెత్త బుట్టలో వేయాల్సిందే …సీఎం రేవంత్ రెడ్డి నెలకోసారి విద్యా శాఖ పై రివ్యూ చేస్తే సాధించిందేమిటి ?గురుకులాల్లో దారుణమైన పరిస్థితులు ఎందుకుంటాయి ? …విద్యావ్యవస్థను కమిషన్ భుజాల మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డి కాల్చాలనుకుంటున్నారు ..ఈ కమిషన్ రిపోర్టు అమలయితే తెలంగాణ విద్యావ్యవస్థ వెనక్కి పోవడం ఖాయమన్నారు.