సేఫ్‌గా సంపద సృష్టిద్దాం.. టాప్-5 సురక్షిత పెట్టుబడి సాధనాలివే..!
దేశంలో పెట్టుబడులు దశాబ్దాలుగా కుటుంబ భద్రత, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అధిగమించే రాబడుల ఆధారంగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సురక్షిత పెట్టుబడి సాధనాలకు ఇప్పటికీ డిమాండ్ కనిపిస్తున్నది.
దేశంలో పెట్టుబడులు దశాబ్దాలుగా కుటుంబ భద్రత, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అధిగమించే రాబడుల ఆధారంగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సురక్షిత పెట్టుబడి సాధనాలకు ఇప్పటికీ డిమాండ్ కనిపిస్తున్నది. మార్కెట్ సంబంధిత రిస్క్‌లకు దూరంగా ఉంటూ సంపద సృష్టికి ఇవే మార్గాలు మరి. ఈ ఏడాదికిగాను టాప్-5 సురక్షిత పెట్టుబడి ప్లాన్లు ఏంటో చూద్దామా..
1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
సురక్షితంగా దీర్ఘకాలంలో ఆకర్షణీయ రాబడులను అందించడంలో పీపీఎఫ్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ పథకం వెనుక కేంద్ర ప్రభుత్వం భరోసా ఉండటమే మెజారిటీ మదుపరులు మెచ్చేలా చేస్తున్నది. పిల్లల ఉన్నత విద్యకు లేదా రిటైర్మెంట్ ప్లానింగ్‌కు చక్కని సాధనంగా పరిగణించవచ్చు.
- వార్షిక వడ్డీ: 7.1 శాతం.
- కాలవ్యవధి: 15 ఏండ్లు. ఆపై ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా 5 ఏండ్ల చొప్పున పొడిగించుకోవచ్చు.
- గరిష్ఠ పెట్టుబడి: ఏటా రూ.1.5 లక్షలు.
- పన్నులు: వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ సొమ్ము దేనిపైనా పన్నులుండవు.
2.ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లు (ఎఫ్ఆర్ఎస్బీ)
ప్రామాణిక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) కంటే ఎక్కువ రాబడుల కోసం మీరు చూస్తున్నైట్టెతే.. ఈ బాండ్లు మీకు చక్కని పెట్టుబడి సాధనాలే. కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వీటిని జారీ చేస్తుంది. కనుక ఇవి సురక్షితమే. వడ్డీరేట్లు 6 నెలలకోసారి మారుతూ ఉంటాయి. జాతీయ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) రేటు కంటే 0.35 శాతం ఎక్కువగా ఉంటుంది. అధిక వడ్డీరేటుతో చట్టబద్ధ పూచీకత్తు కలిగిన పెట్టుబడులను ఆశించేవారికి ఈ బాండ్లు అనువైనవి.
- ప్రస్తుత వార్షిక వడ్డీ: 8.05 శాతం.
- కాలపరిమితి: 7 ఏండ్లు.
- గరిష్ఠ పెట్టుబడి: కనీసం రూ.1,000. గరిష్ఠంగా ఎంతైనా మదుపు చేయవచ్చు.
- పన్నులు: మీ ఆదాయ పన్ను (ఐటీ) శ్లాబు ప్రకారం వడ్డీపై పన్నులు వర్తిస్తాయి.
3. ఫిక్స్డ్ డిపాజిట్లు (పోస్టాఫీస్, బ్యాంకులు)
బ్యాంక్, పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) ఎప్పట్నుంచో ఎంతో సురక్షిత పెట్టుబడి సాధనాలుగా విరాజిల్లుతున్నాయి. ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు ఎఫ్డీలపై అధిక వడ్డీరేట్లను డిపాజిటర్లకు చెల్లిస్తున్నాయి. ఇక పోస్టాఫీస్ ఎఫ్డీలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. ఏడాది నుంచి ఐదేండ్ల లక్ష్యాలకు ఈ ఎఫ్డీలు లాభదాయకం.
- పోస్టాఫీస్ 5 ఏండ్ల ఎఫ్డీపై 7.5 శాతం వార్షిక వడ్డీ.
- ప్రముఖ ప్రైవేట్/ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్డీలపై వడ్డీరేట్లు 6.5-7.25 శాతం మధ్య ఉన్నాయి.
- స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంకుల్లోనైతే వడ్డీరేట్లు గరిష్ఠంగా 8 శాతం.
- డీఐసీజీసీ ద్వారా రూ.5 లక్షలదాకా బ్యాంక్ డిపాజిట్లకు బీమా భద్రత.
4. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)
ఎన్ఎస్సీ అనేది ఓ నిర్ధిష్ట ఆదాయ పెట్టుబడి సాధనం. ఇది పోస్టాఫీస్‌లలో అందుబాటులో ఉంటుంది. మధ్యతరగతి ఆదాయ వర్గాలకు సరైన పెట్టుబడి వేదికగా చెప్పుకోవచ్చు. వేతన జీవులకూ ఉత్తమమే.
- వార్షిక వడ్డీ: 7.7 శాతం (ఏటా లెక్కించి, మెచ్యూరిటీ అయ్యాకే చెల్లిస్తారు).
- కాలవ్యవధి: 5 ఏండ్లు.
- పన్నులు: తొలి నాలుగేండ్లలో ఆర్జించిన వడ్డీ ఆదాయాన్ని రీ-ఇన్వెస్ట్మెంట్గా పరిగణించి ఐటీ చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపునకు అనుమతిస్తారు.
5. సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై)
కుటుంబంలోని ఆడపిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ఉద్దేశించినదీ పథకం. అందుబాటులో ఉన్న అన్ని చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో అత్యుత్తమ వడ్డీరేట్లు ఈ స్కీమ్‌కే ఉంటాయి. ఆడపిల్లల తల్లిదండ్రులు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు.
- వార్షిక వడ్డీ: 8.2 శాతం.
- కాలపరిమితి: ప్రారంభించిన దగ్గర్నుంచి 21 ఏండ్ల తర్వాత మెచ్యూరిటీకి వస్తుంది. మధ్యలో పాక్షిక నగదు ఉపసంహరణలకు వీలున్నది. అమ్మాయికి 18 ఏండ్లు నిండితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మొత్తంగా పెట్టుబడులనూ వెనుకకు తీసుకోవచ్చు.
- పన్నులు: సుకన్య సమృద్ధి యోజనకు పన్నులు వర్తించవు.
చివరగా..
పెట్టుబడి ప్రణాళికలు అనేవి.. మన ఆర్థిక లక్ష్యాలు, నగదు అవసరాలు, పన్నుల ఆధారంగా ఉంటాయి. నిజానికి సంప్రదాయ పెట్టుబడుల కంటే మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో రాబడులు ఎక్కువగా కనిపిస్తాయి. అయినప్పటికీ సురక్షిత పెట్టుబడి సాధనాలను వదులుకోకపోవడమే మదుపరి తెలివికి నిదర్శనంగా నిలుస్తుంది. కాబట్టి మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా తీర్చిదిద్దుకోండి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

