Six Guarantees | ఆళ్లపల్లి, ఫిబ్రవరి12 : ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 20న హైదరాబాద్లో నిర్వహించే భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నామని సిపిఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కొక్కు సారంగపాణి, బట్టు ప్రసాద్ డివిజన్ నాయకులు మెస్సు గోపాల్, బత్తిని సత్యం అన్నారు. ఈ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఇవాళ ఆళ్లపల్లి మండల పరిధిలోని లక్ష్మీపురం, ఇప్పనపల్లిలో నిర్వహించిన సమావేశాల్లో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పేదలందరికీ పక్కా గృహాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని,పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, వైద్య సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ మండల నాయకులు పూనెం లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పూనెం మంగ, పూణెం బక్కయ్య, కుంజ రామారావు, ఈసం ఎల్లన్న, గొగ్గల బొజ్జన్న, గొగ్గల బాబు, ఈసం అప్పారావు, గొగ్గల రమణ, గొగ్గల సమ్మక్క గ్రామస్తులు పాల్గొన్నారు.
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Mythological Drama Competitions | పౌరాణిక నాటక పోటీలకు బ్రోచర్ ఆవిష్కరణ
Maha Kumbh Mela | మాఘ పౌర్ణమి.. 1.83 కోట్ల మంది పుణ్యస్నానాలు