Ganja | పాల్వంచ, ఫిబ్రవరి 24 : ఆంధ్రా-ఒడిశా బోర్డర్ నుండి హైదరాబాద్కు భద్రాచలం, పాల్వంచ మీదుగా ఎండు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ టీం సీఐ సుంకరి రమేష్, సిబ్బంది ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం పాల్వంచలోని నవభారత్ వద్ద పట్టుకున్నారు.
గంజాయి తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు పాల్వంచలోని నవ భారత్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. మర్రి సాయి తేజ, కట్ల వివేక్ రెడ్డి హోండా డ్రీమ్ యుగ బైక్ AP 20AP4968 మీద ఐదు కేజీల ఎండు గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ గంజాయి ఆంధ్రా-ఒడిశా బోర్డర్ నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 2 లక్షలు ఉంటుందని సీఐ సుంకర రమేష్ తెలిపారు.
గంజాయిని పట్టుకున్న వారిలో సీఐ సుంకర రమేష్, హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుల్స్ సుధీర్, వెంకటేష్, విజయ్, హనుమంతరావు, ఉపేందర్ లు ఉన్నారు. పట్టుకున్న సిబ్బందికి డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వీబీ కమలాసన్ ఐపీఎస్, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ గణేష్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి అభినందించారు.
Kothagudem | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.. కొత్త అక్రెడిటేషన్ కార్డులపై మీడియా అకాడమీ విఫలం..
Kothagudem | మళ్లీ సర్వే చేయండి.. కులగణనలో మున్నూరుకాపులకు అన్యాయం: కాంపెల్లి కనకేష్ పటేల్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!