రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్(Congress) పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలోని నర్సక్కపేట గ్రామానికి చెందిన తిప్పరవేణి శ్రీనివాస్(40) అనే రైతు తనకున్న 20 గుంటలతో పాటు మరో రెండెకరాలు కవులుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. దీంతో పాటు ఇంటి వద్ద చికెన్ సెంటర్, పెళ్లిళ్లకు బ్యాండ్ పనులు చేస్తున్నాడు. వ్యవసాయం కలిసిరాక చేసిన అప్పులు తీరక పురుగుల మందు తాగి ఆత్మహత్య(Farmer Commits suicide) చేసుకున్నాడు. మృతుడికి భార్య దేవలక్ష్మి, కూతురు, కుమారుడున్నారు. శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..