Rashmika Mandanna | మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ప్రాజెక్ట్ ఛావా (Chhaava). బాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్కీకౌశల్ (Vicky Kaushal) టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్నా (Rashmika Mandanna)ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. రష్మిక ఇందులో మహారాణి యేసుబాయి పాత్రలో నటిస్తోంది.
ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విక్కీకౌశల్ అండ్ రష్మిక టీం రీసెంట్గా హైదరాబాద్‌కు వచ్చేసిందని తెలిసిందే. అయితే కాలుకి గాయంతో కొన్ని రోజులుగా బెడ్ రెస్ట్‌లో ఉందని తెలిసిందే. నడవలేని స్థితిలో విశ్రాంతి తీసుకోవాల్సిన రష్మిక మందన్నా.. అదేమీ పట్టించుకోకుండా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది.
విక్కీ కౌశల్ సాయంతో వీల్ ఛైర్లో ఈవెంట్‌కు వచ్చిన రష్మికమందన్నాకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రష్మిక మందన్నా సంప్రదాయ పద్దతిలో విక్కీ కౌశల్‌కు హారతి పట్టి నుదుట బొట్టు పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ వీల్‌ఛైర్‌లో ప్రమోషన్స్‌లో పాల్గొంటుండటంతో రష్మికమందన్నా ప్రొఫెషనల్ కమిట్మెంట్కు, డెడికేషన్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ చిత్రాన్ని మ్యాడ్‌డాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మిస్తున్నాడు.
రష్మిక మందన్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ నటిస్తోన్న కుబేరలో హీరోయిన్గా నటిస్తుండగా.. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా చేస్తుంది.
They looked super adorable.
Film ko lekar bohot positive vibes aa rahi hain. Hope kisi ki nazar na lage.@iamRashmika @vickykaushal09#RashmikaMandanna #VickyKaushal #Chhaava pic.twitter.com/w9sWqyw2zD— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) February 1, 2025
The dedication with which #RashmikaMandanna is promoting this movie will be remembered in the future, showing how serious she is about her work. Despite her current condition, she came to promote the movie in a wheelchair. I’m confident that the pairing of #VickyKaushal and… pic.twitter.com/E4aM1EQ19P
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) January 31, 2025
Union Budget 2025 | గంటా 15 నిమిషాల పాటు కొనసాగిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం