Divi | ‘హనీ’ ట్రైలర్ లాంచ్‌లో దివి వాద్య కామెంట్స్ వైరల్… బెదిరిస్తారు, ఆ తర్వాత మామిడికాయలు ఇస్తారు…
Divi | బుల్లితెరపై ప్రసారమైన పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న తెలుగు నటి దివి వాద్య. బిగ్ బాస్ షో అనంతరం వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా ఆమె కీలక పాత్రలో నటించిన తెలుగు హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘హనీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Divi | బుల్లితెరపై ప్రసారమైన పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న తెలుగు నటి దివి వాద్య. బిగ్ బాస్ షో అనంతరం వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా ఆమె కీలక పాత్రలో నటించిన తెలుగు హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘హనీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, నటి దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించగా, సీనియర్ నటుడు రాజా రవీంద్ర కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో చిత్రబృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో దివి వాద్య చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈవెంట్లో మాట్లాడిన దివి మొదట దర్శకుడు కరుణ కుమార్‌తో పని చేయాలనే తన కోరికను వ్యక్తపరుస్తూ, పలాస సినిమా సమయంలో కలిసినా అప్పట్లో అవకాశం రాలేదని, ఈ కథ వినగానే చాలా ఎగ్జైటెడ్‌గా ఫీలయ్యానని తెలిపింది. నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, రాజా రవీంద్ర వంటి అనుభవజ్ఞులైన నటులతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని, ఈ సినిమా ప్రేక్షకులను వెంటాడే విధంగా ఉంటుందని, అందరూ ఫిబ్రవరి 6న థియేటర్లకు వెళ్లి చూడాలని కోరింది. అనంతరం మీడియా ప్రతినిధులు ఆమె పాత్ర గురించి ప్రశ్నించగా, ట్రైలర్లో కనిపిస్తున్నట్లు తన క్యారెక్టర్లో డార్క్ షేడ్స్ ఉంటాయని సింపుల్‌గా సమాధానం ఇచ్చింది. అయితే ఆమె అలా చెప్పగానే పక్కనే ఉన్న రాజా రవీంద్ర “ఏయ్” అంటూ సరదాగా వారించడం అక్కడ నవ్వులు పూయించింది.
దానికి స్పందించిన దివి “చెప్పొద్దా?” అంటూ సరదాగా ప్రశ్నించగా, రాజా రవీంద్ర నిశ్శబ్దంగా ఉండిపోయాడు. వెంటనే దివి “ఇలా అందరి ముందు బెదిరిస్తారు… ఎవరు లేనప్పుడు మాత్రం మామిడి కాయలు ఇస్తారు” అని చమత్కరించడంతో హాల్ మొత్తం నవ్వులతో మార్మోగింది. దాంతో రాజా రవీంద్ర షూటింగ్ సమ్మర్లో జరిగిన విషయమని వివరణ ఇచ్చాడు. రిపోర్టర్లు మామిడి కాయల విషయంపై అడగగా, సెట్స్‌లో రాజా రవీంద్ర గారి హాస్పిటాలిటీ చాలా బాగుండేదని, అదే ఉద్దేశంతో అలా అన్నానని దివి క్లారిటీ ఇచ్చింది. అనంతరం తన పాత్రపై మాట్లాడుతూ, సినిమాలో తన డార్క్ సైడ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని, ఇలాంటి నెగెటివ్ లేదా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు భవిష్యత్తులో మరింత వస్తాయని ఆశిస్తున్నానని చెప్పింది. దర్శకుడు కరుణ కుమార్ తన నుంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తీసుకున్నారని, తానేనా ఇలా చేశానని అనిపించేలా పని చేయించారని పేర్కొంది. మొత్తానికి ‘హనీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దివి వాద్య చేసిన సరదా వ్యాఖ్యలు, రాజా రవీంద్రతో జరిగిన ఫన్నీ మోమెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

