మల్యాల, ఫిబ్రవరి 01: జగిత్యాల(Jagithhyala) జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్(DGP Jitender) సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారికి డీజీపీ దంపతుల చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, ఆలయ స్థానాచార్యులు కపిందర్, ప్రధాన అర్చకులు జితేందర్, వకలాభరణం రఘు, ఉపప్రధాన అర్చకులు చిరంజీవి స్వామి, వేద పండితులు రాజేశ్వర్ శర్మ, తేజ శర్మ, మల్యాల సీఐ నీలం రవి, జగిత్యాల సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, ఆలయ పర్యవేక్షకుడు హరిహరనాథ్, ఇన్స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..