KTR | వికారాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిగి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పూడూరు మండలం సోమన్గుర్తి గేటు వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం లభించింది. కేటీఆర్కు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
మరికాసేపట్లో పరిగి నియోజకవర్గం కులకచర్ల మండలంలోని దాస్యానాయక్ తండాలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. కేటీఆర్ పర్యటన దృష్ట్యా విగ్రహావిష్కరణతోపాటు బహిరంగ సభకు సంబంధించి సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
పరిగి నియోజకవర్గం, పూడూరు మండలం సోమన్గుర్తి గేట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి ఘన స్వాగతం!
కేటీఆర్కు స్వాగతం పలికిన పరిగి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలు, పార్టీ కార్యకర్తలు.
భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు! pic.twitter.com/7JLXDcScxy
— BRS Party (@BRSparty) February 1, 2025
ఇవి కూడా చదవండి..
Harish Rao | పుల్లూరు బండ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతాం : హరీశ్ రావు
Turmeric Board | ఇందూరులో బోర్డు.. ఢిల్లీలో బాధ్యతలా?.. పసుపుబోర్డు ఏర్పాటులో కేంద్రం దోబూచులాట
Osmania Hospital | ఉస్మానియాకు 2700 కోట్లు ఎందుకు?.. నిర్మాణ అంచనాలపై నిపుణుల్లో అనుమానాలు