Osmania Hospital | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖానకు నూతన భవనాలను నిర్మించేందుకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వం అంచనా వ్యయం కూడా ప్రకటించింది. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాలు నిర్మిస్తామని, 2000 పడకలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నది. భవనాల నిర్మాణాలకు రూ.2,700 కోట్ల బడ్జెట్ అవసరమని ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. కానీ ఈ లెక్కలపై నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అంత ఖర్చు ఎందుకవుతుందని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో సకల సౌకర్యాలతో చేపట్టిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన, హైదరాబాద్ నలువైపులా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)లతో పోల్చితే ఉస్మానియా ఖర్చు భారీగా ఉండడంలో ఆంతర్యమేంటని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సుమారు 700 కోట్లు తేడా కనిపిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు.