పార్టీలకతీతంగా ముందుకుపోదాం
పార్టీలకతీతంగా ముందుకుపోదామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. అభివృద్ధిలో ఇంద్రేశం మున్సిపాలిటీని ముందుంచాలన్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రే శం మున్సిపాలిటీ రామేశ్వరంబండ వార్డు కార్యాలయంలో మంగళవారం మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
- అభివృద్ధిలో ఇంద్రేశం మున్సిపాలిటీ ముందుండాలి
- పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు రూరల్, ఫిబ్రవరి 24: పార్టీలకతీతంగా ముందుకుపోదామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. అభివృద్ధిలో ఇంద్రేశం మున్సిపాలిటీని ముందుంచాలన్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రే శం మున్సిపాలిటీ రామేశ్వరంబండ వార్డు కార్యాలయంలో మంగళవారం మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంద్రేశం నూతన చైర్పర్సన్ కుశంగుల ప్రమీలను వారు అభినందించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంద్రేశం మున్సిపాలిటీ అభివృద్ధిలో పోటీపడాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసే అవకాశం కొందరికే లభిస్తుందన్నారు. ప్రజలు కోరుకున్న అభివృద్ధిని అందజేయాలన్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీకి రూ.15కోట్ల అభివృద్ధి నిధులు వచ్చాయని, వాటితో అభివృద్ధి పనులు ప్రారంభించుకుందామన్నారు. ప్రభుత్వం అందజేసే నిధులతో పాటు పారిశ్రామికవేత్తలు, రియల్టర్ల నుంచి సీఎస్సార్ ఫండ్స్ సేకరించి పనులు పూర్తి చేద్దామన్నారు. రాబోయే ఐదేండ్ల కాలాన్ని పూర్తిగా ప్రజాసేవకే ఉపయోగించుకోవాలన్నారు.
ప్రతిశాఖ అధికారి వివరాలు కౌన్సిలర్లు కలిగి ఉండాలన్నారు. నేరు గా అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల వరకే పార్టీలని, అందరూ అభివృద్ధివైపు ధ్యాస పెట్టాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కుశంగుల ప్రమీల మాట్లాడుతూ తొలిసారిగా ఎన్నికైన సభ్యులు, తనకు అధికారు లు, ప్రజాప్రతినిధులు అండగా నిలవాలని కోరారు. అందరిని కలుపుకొని పోతామని తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పాలకవర్గాన్ని పరిచయం చేసుకుని ఘనంగా సత్కరించా రు. ఎంపీ రఘునందర్రావు నూతన కౌన్సిలర్లతో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పట్లోళ్ల హరీశ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అజయ్‌రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

