హనుమకొండ, ఫిబ్రవరి 24 : ‘అక్రెడిటేషన్ల జారీలో డెస్క్ జర్నలిస్టులపై వివక్ష చూపొద్దు.. 252 జీవోలో ప్రభుత్వం సరవరణలు చేసి న్యాయం చేయాలి..’ అని డెస్క్ జర్నలిస్టులు, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు నినదించారు. డెస్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని కోరుతూ డెస్క్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీనికి ఐజేయూ, ఐజేయూ 143, జర్నలిస్టు ఫెడరేషన్ యూనియన్ల నాయకులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ వివిధ పత్రికల్లో పనిచేస్తున్న డెస్ జర్నలిస్టులందరికీ గతంలో జారీ చేసినట్లుగా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరంగల్ ఎడిషన్ పరిధిలో హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఇకడి నుంచే ఆయా పత్రికలు వెళ్తాయని తెలిపారు. ఆయా జిల్లాల వార్తలు చూసే సబ్ ఎడిటర్లందరికీ గతంలో అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు.
ఈసారి ఎడిషన్ కేంద్రంలో నాలుగు మాత్రమే కార్డులు ఇస్తామని జీవోలో పేరొనడంతో సబ్ ఎడిటర్లకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పునరాలోచించి సబ్ ఎడిటర్లందరికీ ఎడిషన్ కేంద్రంలోని అక్రెడిటేషన్ కార్డులు జారీచేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ స్నేహా శబరీష్‌కు వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో డీజేఎఫ్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా అడ్‌హక్ కమిటీ సభ్యులు సీహెచ్ సోమనర్సయ్య, ఎంహెచ్ ముజాహిద్, బోనాల రమేశ్, వనం శ్రీకాంత్, పైళ్ల రఘుపతి, నాయకులు శంకేసి శంకర్రావు, వర్ధెల్లి లింగయ్య, సీనియర్ సబ్ ఎడిటర్లు కెంచ అశోక్, లోకుల రఘుపతి, టీయూడబ్ల్యూజే(హెచ్) 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్, హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మసపురి సుధాకర్, అర్షం రాజ్‌కుమార్, ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు, హనుమకొండ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు రాజిరెడ్డి, తోట సుధాకర్, ప్రెస్‌క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవ మూర్తి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ఉపాధ్యక్షులు బొడిగె శ్రీను, అల్లం రాజేశ్‌వర్మ, కోశాధికారి బోల్ల అమర్, టీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు.