ఇసుక టిప్పర్లను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గంలోని ఆదివారం సెలవు రోజున కూడా ఇసుక తరలింపు కొనసాగడంతో స్థానిక రైతులు విషయాన్ని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మాగనూరు మండలం నుంచి మక్తల్ మీదుగా నారాయణపేట వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్లను మాజీ ఎమ్మెల్యే అడ్డుకున్నారు.
- కలెక్టర్కు ఫిర్యాదు అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
మక్తల్, ఆగస్టు 16 : నియోజకవర్గంలోని ఆదివారం సెలవు రోజున కూడా ఇసుక తరలింపు కొనసాగడంతో స్థానిక రైతులు విషయాన్ని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మాగనూరు మండలం నుంచి మక్తల్ మీదుగా నారాయణపేట వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్లను మాజీ ఎమ్మెల్యే అడ్డుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించిన అనుమతులు, పర్మిట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్సై అకడికి చేరుకొని ఇసుక తరలిస్తున్న వాహనాలను పరిశీలించి, వాటికి సంబంధించిన అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. వాగుల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. శివారు వాగుల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, రవాణాపై రెవెన్యూ, పోలీసు అధికారులు నిరంతరం నిఘా పెట్టి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

