కోస్గి, ఆగస్టు 16 : బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ పత్రికలపై వారు వ్యవహరించిన తీరు అత్యంత హేయమైనదని కోస్గి మండల జర్నలిస్టులు అన్నారు. నాలుగు రోజుల కిందట వికారాబాద్ జిల్లా హకీంపేట గ్రామానికి చెం దిన కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డి నమస్తే తెలంగాణ దినపత్రికపై వ్యవహరించిన తీరును తప్పుపడుతూ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం జర్నలిస్టులు మాట్లాడుతూ పత్రిక ఏదైనా విలువలతో కూడిన వార్తలను రా స్తుందని అలాంటి వాటిపై ఏవైన అభ్యంతరాలుంటే ఖండించాలి లేదా సమావేశం పెట్టి వివరణ ఇవ్వాలన్నారు. అంతేకాని వార్తలు రాశారంటూ పత్రికలపై ఇలా వ్యవహరించడం తప్పని ఇది అత్యంత హేయమైన సంఘటన అని అన్నారు. ఎన్నో ఏండ్లుగా జర్నలిస్టులుగా విధులు నిర్వహిస్తున్నామని ఇప్పటి వరకు ఏ నాయకుడు పత్రికలపై ఇలా వ్యవహరించలేదన్నారు.
ఎంతో కష్టపడి సమాచారం సేకరించి జర్నలిస్టులు వార్తలు రాస్తారని వాటిలో ఎలాంటి కల్పితం ఉండవని అన్నారు. ఏ పత్రిక అయినా సరే ప్రభుత్వ అధికారులను నాయకులను ప్రజా సమస్యలపై నిలదీస్తుందని తెలిపారు. హకీంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డి తనపై వచ్చిన వార్తలు తప్పు అన్న నెపంతో నమస్తే తెలంగాణ పత్రిక పై ఆయన మీడియా సమావేశంలో ప్రవర్తించిన తీరు చాలా దారుణం అని ముక్త కంఠంతో ఖండించారు.
మరోసారి ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఏ పార్టీ నాయకులైన పత్రికలపై బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు. సదరు కాంగ్రెస్ నేత ఒకప్పుడు జర్నలిస్టుగా పని చేసాడన్న సంగతి మరిచిపోరాదని హితవు పలికారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రమణారెడ్డి, సల్మాన్ రాజు, శంకర్, చైతన్య గౌడ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
మద్దూర్, ఆగస్టు16 : నమస్తే తెలంగాణ దినపత్రికపై అనుచిత, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం మద్దూర్ మండల ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మద్దూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లా హకీంపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డిపై ఆయన అనుచరులపై, అలాగే నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కొన్ని వార్తల విషయంలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు ప్రెస్‌క్లబ్ సభ్యులు ఎస్సై విజయ్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదును అందజేశారు. పత్రిక ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించి విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నారాయణరెడ్డి, షఫీ, పవన్‌కుమార్‌రెడ్డి, వెంకటేశ్, అతిక్, కమ్రుద్దీన్ పాల్గ్గొన్నారు.