హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ) షో జంపింగ్ పోటీల 40 సెంటిమీటర్ల ఓపెన్ విభాగంలో కింగ్స్ ఈక్వెస్ట్రియన్కు చెందిన యువాన్ తుమ్మల మొదటి స్థానంతో విజేతగా నిలిచాడు.
గండిపేటలోని హెచ్పీఆర్సీ ప్రాంగణంలో జరిగిన పోటీల ఓపెన్ విభాగంలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్న యువాన్.. అండర్-12 కేటగిరీలోనూ రెండో స్థానంతో సత్తాచాటాడు.