తల్లి ఇసుక దందా.. కొడుకు బెట్టింగ్ మాఫియా!
మంత్రి సీతక ములుగు జిల్లాలోని ప్రకృతి వనరులను దోచుకుంటుంటే, ఆమె కొడుకు సూర్య బెట్టింగ్‌లతో జిల్లా యువత జేబులు కొల్లగొడుతున్నాడని రెడో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు.
- మంత్రి ప్రకృతి వనరులను దోచుకుంటుంటే.. ఆమె కొడుకు పేదల జేబులు కొల్లగొడుతున్నడు
- ములుగు ప్రీమియర్ లీగ్ పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తున్న మంత్రి సీతక్క కొడుకు సూర్య
- ఆధారాలు బయటపెట్టిన రెడో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): మంత్రి సీతక ములుగు జిల్లాలోని ప్రకృతి వనరులను దోచుకుంటుంటే, ఆమె కొడుకు సూర్య బెట్టింగ్‌లతో జిల్లా యువత జేబులు కొల్లగొడుతున్నాడని రెడో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఆదివారం మీడియాతో సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీతక కొడుకు సూర్య.. ‘ములుగు ప్రీమియర్ లీగ్’ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ పేరుతో బెట్టింగ్‌కు పాల్పడుతున్నాడని, పోలీసు స్టేడియంలో పోలీసు అధికారులతోనే టోర్నమెంట్‌ను ప్రారంభించాడని ఆరోపించారు.
ఇదే టోర్నమెంట్ ఇప్పుడు ‘వన్ ఎక్స్ బెట్’ అనే బెట్టింగ్ యాప్‌లో లైవ్ అవుతున్నట్టు పేర్కొన్నారు. బెట్టింగ్‌లో మోసపోయిన కొందరు యువకులు తనకు సమాచారం ఇచ్చారని, దీంతో ఈ విషయం బయటకు వచ్చిందని సతీశ్‌రెడ్డి తెలిపారు. దీని వల్ల అనేక మంది యువకులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారని ఆధారాలతో బయటపెట్టారు.
ఎన్జీటీ స్టే ఇచ్చినా ఆగని ఇసుక దందా..
సీతమ్మ సాగర్ బరాజ్ వద్ద డీసిల్టేషన్ పేరుతో దాదాపు రూ.2,300 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వారని సతీశ్‌రెడ్డి ఆరోపించారు. ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినప్పటికీ, జిల్లా మంత్రి సీతక, ఇన్చార్జి మంత్రి పొంగులేటి అండదండలతో ఇసుక దందా జరుగుతున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

