బూర్గంపహాడ్, సెప్టెంబర్ 23 : ఐటీసీ బంగారు భవిష్యత్ ప్రోగ్రాం ద్వారా బైఫ్, వైడీవో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో బూర్గంపహాడ్ మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సారపాక పశువైద్యాధికారి బాలకృష్ణ మహిళలకు జీవాల పెంపకం, వాటికి ఈ సీజన్లో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ప్రథమ చికిత్సలకు సంబంధించి అవగాహన కల్పించారు. అనంతరం ప్రథమ చికిత్స మెడికల్ కిట్లను యజమానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బైఫ్ సంస్థ నుండి సైదయ్య, వైడీవో డైరెక్టర్ కృష్ణ, ప్రాజెక్టు కోఆర్డినేటర్ నాగరాజు, సిబ్బంది, పశు సఖీలు పాల్గొన్నారు.