కోఠి కాల్పుల కేసులో ఇద్దరు అరెస్ట్..
కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద తుపాకీతో కాల్పులు జరిపి రూ.6లక్షల నగదు దోచుకు న్న అంతర్ రాష్ట్రముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ , సుల్తాన్బబజార్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను సిటీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బషీర్‌బాగ్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ మత్తయ్యలతో కలిసి వెల్లడించారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద తుపాకీతో కాల్పులు జరిపి రూ.6లక్షల నగదు దోచుకు న్న అంతర్ రాష్ట్రముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ , సుల్తాన్బబజార్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను సిటీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బషీర్‌బాగ్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ మత్తయ్యలతో కలిసి వెల్లడించారు. పోలీసులు అరెస్ట్చేసినవారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పుర్కాన్ అహ్మ ద్, హైదరాబాద్‌లో నివసిస్తున్న మహ్మద్ తయబ్ త్యాగి ఉన్నారు.
వీరి నుంచి ఒక నాటు తుపాకీ, 35 లైవ్ తూటాలు, 2 మ్యాగజైన్లు, రూ.2.38లక్షలు నగదు , 2 మొబైల్ పోన్లను స్వాధీనం చేసుకున్నా రు. ఈ కేసులో ఫహీమ్ అహ్మద్, నౌషాద్, అబిద్, డానిష్త్యాగి, మహ్మద్ మత్లూబ్ అనే మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నా రు. నిందితుడు తయబ్ త్యాగి ఓలా డ్రైవర్‌గా పనిచేస్తూ కోఠి, అబిడ్స్ ప్రాంతాల్లో తెల్లవారుజామున నగదు డిపాజిట్ చేసేవారిని గమనించి దోపిడీకి పథకం వేశారు.
కేరళకు చెందిన రిన్షాద్ అనే వ్యాపారి జనవరి 31న ఉదయం ఏడుగంటల ప్రాంతంలో డబ్బులు డిపాజిట్ చేయడం కోసం కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చి ఏటీఎంకు వెళ్లాడు. ఆ ఇద్దరు దుండగులు రిన్షాద్‌పై కాల్పులు జరిపి డబ్బుతో ఉన్న బ్యాగ్ తీసుకుని పరారయ్యారు. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో టాస్క్‌పోర్స్‌కు చెందిన సికింద్రాబాద్ జోన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఖైరతాబాద్‌జోన్ ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్‌గౌడ్, ఎస్ఐలు జ్ఞానదీప్, శ్రీకాంత్,నరేశ్‌లు కీలకపాత్ర పోషించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

