Aamir Khan | 59 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో..?
Aamir Khan | బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ (Aamir Khan) మూడో పెళ్లిక సిద్ధమైనట్లు తెలిసింది.
Aamir Khan | బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ (Aamir Khan) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లీడింగ్ యాక్టర్లలో టాప్లో ఉంటారు. ఆయన్ని ముద్దుగా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని కూడా పిలుస్తుంటారు. లగాన్, గజినీ, పీకే, దంగల్తోపాటు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ అందించి సక్సెస్ రేంజ్లో ఉన్న ఈ స్టార్ పర్సనల్ లైఫ్లో మాత్రం అంత హ్యాపీగా లేడనే చెప్పాలి. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమీర్ వయసు 59 ఏళ్లు. ఈ క్రమంలోనే ఆమీర్ ముచ్చటగా మూడో పెళ్లిక సిద్ధమైనట్లు తెలిసింది.
బెంగళూరుకు (Bengaluru) చెందిన ఓ మహిళతో ఆమీర్ ఖాన్ గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఆమెను ఇటీవలే తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేసినట్లు టాక్. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే అతి త్వరలోనే ఆమీర్ మూడోసారి పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు నటుడి దగ్గరి వ్యక్తి ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియాలో కూడా వరుస కథనాలు వస్తున్నాయి. ‘ఆమీర్ బెంగళూరుకు చెందిన ఓ మహిళతో డేటింగ్లో ఉన్నారు. వారి గోప్యతను గౌరవించి వ్యక్తిగత వివరాలు వెల్లడించలేను. ఆమెను ఆమీర్ తన కుటుంబ సభ్యులందరికీ పరిచయం చేశాడు. ఆ మీటింగ్ చాలా బాగా జరిగింది’ అంటూ సరదు వ్యక్తి చెప్పినట్లు మీడియా పేర్కొంది.
కాగా, ఆమీర్ ఖాన్కు ఇప్పటికే రెండు వివాహాలైన విషయం తెలిసిందే. 1986లో రీనా దత్తాను ఆమీర్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఐరా ఖాన్, జునైద్ ఖాన్ ఉన్నారు. ఐరాకు ఇటీవలే పెళ్లైంది కూడా. ఇక రీనా దత్తా – ఆమీర్ జంట 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో చిత్ర నిర్మాత అయిన కిరణ్రావును వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఆజాద్ ఉన్నాడు. ఆ పిల్లాడు సరోసగీ ద్వారా జన్మించాడు. అయితే, కిరణ్ రావుతో కూడా ఆమీర్ విడాకులు తీసుకున్నాడు. 15 ఏళ్ల వివాహ బంధానికి 2021లో ముగింపు పలికారు. ఈ క్రమంలోనే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ 59 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read..
Nadaaniyan | హీరోగా సైఫ్ అలీఖాన్ కొడుకు.. ‘నాదానియన్’ ఫస్ట్ లుక్ రిలీజ్
Anna Beatriz | పోర్న్ సీన్ షూటింగ్ అనంతరం బిల్డింగ్పై నుంచి పడి స్టార్ నటి మృతి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

