Anna Beatriz : హోటల్ రూమ్ (Hotel Room) లో పోర్న్ సీన్ షూటింగ్ అనంతరం బ్రెజిల్ (Brezil) దేశానికి చెందిన పోర్న్ స్టార్ అన్నా బిట్రిజ్ (Anna Beatriz) భవనంపై నుంచి కిందపడి మృతిచెందారు. సోషల్ మీడియాలో అన్నా పోలీ (Anna Polly) గా సుపరిచితురాలైన 27 ఏళ్ల పోర్న్ స్టార్ బిల్డింగ్ పైనుంచి పడటం ప్రమాదవశాత్తు జరిగిందా.. లేదంటే ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ నెల 23న నోవా ఇగాకు (Nova Igacu) లోని ఓ హోటల్ గదిలో అన్నా బిట్రిజ్, మరో ఇద్దరు పురుషులతో త్రీసమ్ పోర్న్ సీన్‌ను చిత్రీకరించారు. షూటింగ్ ముగియగానే బాల్కనీలోకి వచ్చిన అన్నా బిట్రిజ్ భవనం పైనుంచి కిందపడ్డారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలియజేయడానికి వారం రోజుల సమయం పట్టింది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అన్నా బిట్రిజ్తోపాటు షూటింగ్లో పాల్గొన్న పురుష నటులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
వారి నుంచి పలు వివరాలు రాబట్టి అనంతరం వదిలేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ముందుగా అనుమానాస్పద మృతిగా కేసును దర్యాప్తు చేస్తున్నామని, అయితే ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందా అనే విషయాన్ని కొట్టిపారేయలేమని పోలీసులు తెలిపారు. అన్నా బిట్రిజ్ మరణం తనకు తీరని లోటని ఆమె బాయ్ ఫ్రెండ్ పెడ్రో హెన్రిక్ అన్నారు. ఇది ప్రమాదమా, కుట్రనా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలుతుందని పేర్కొన్నారు.
Sai Pallavi | అనారోగ్యంతో సాయి పల్లవి.. రెస్ట్ తీసుకోమన్న వైద్యులు
Mamta Kulkarni | సన్యాసం తీసుకున్న బాలీవుడ్ నటికి షాక్.. కిన్నార్ అఖారా నుంచి బహిష్కరణ