Sai Pallavi Thandel | సాయి పల్లవి అనారోగ్యంతో బాధపడుతుంది. గత కొన్ని రోజులుగా సాయిపల్లవి జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నట్లు తండేల్ చిత్ర దర్శకుడు చందూ మొండేటి వెల్లడించాడు. అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తండేల్ (Thandel). ఇందులో సాయి పల్లవి కథనాయికగా నటిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రబృందం. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా తన హెల్త్ కండిషన్‌ని కూడా పక్కన పెట్టి చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్లో హాజరయ్యింది సాయి పల్లవి. దీంతో తన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రెండు రోజులు ఎలాంటి ప్రమోషన్స్‌కి వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నేడు హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నాడు.