సిద్దిపేట, ఫిబ్రవరి 26 : అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రెవెన్యూ సేవలు అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశించారు. గురువారం సిద్దిపేట అర్బన్ తహసీల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వేగంగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, వారికి గౌరవం ఇవ్వాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు అన్ని రకాల దరఖాస్తులు వేగంగా పరిషరించాలని సూచించారు.