గద్వాల, ఫిబ్రవరి 26 : ప్రతి ఏడాది తమ కల నెరవేతు ందని భావిస్తున్న గుర్రంగడ్డ గ్రామస్తులకు ప్రతి ఏడాది నిరాశే ఎదురవుతున్నది. బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పనులు నత్తనడకన చేస్తుండడంతో మరో రెండేళ్లకైనా తమ గ్రామ బ్రిడ్జి పనులు పూర్తి అవుతా యా? అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు.
ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో కృష్ణానది నడి మధ్యలో ఉన్న ఏకైక దివి గ్రామం గుర్రం గడ్డ. గ్రామం చుట్టూ నీరు మధ్యలో ఊరు చూడ డానికి, వినడానికి అందరికీ మంచిగా అనిపిస్తున్న వర్షాకాలం ప్రారంభం అయిందంటే ఆ గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు లేక వారి బాధలు వర్ణాతీతం. ఆరు నెలలు గ్రామా నికి బాహ్యా ప్రపం చంతో సం బంధాలు ఉండవు. అయినా గ్రామస్తులు ఉన్న ఊరు మీద ఉన్న ప్రేమ బంగారం లాంటి పంటలు పండే భూములను వదులుకోలేక అక్కడే కష్టాలతో సహవాసం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
గుర్రంగడ్డ గ్రామం గద్వాలకు 12కిలో మీటర్ల దూరంలో.. వనపర్తికి 35 కిలో మీటర్ల దూరంలో నది మధ్యలో ఉం టుంది. గ్రామంలో 1000పైగా జనాభా, 580పైగా ఓటు హక్కు కలిగిన ఓటర్లు ఉన్నారు. 2,150 ఎకరాల విస్తీర్ణం లో గ్రామం ఉంది. ఇందులో సుమారు 1600 ఎకరాలకు పైగా సాగు భూమి ఉన్నది. అయితే వీరు పండించి న పంటను మార్కెట్కు తరలించాలన్నా.. అత్యవసం వైద్యం కావాలన్నా.. ఉన్నత చదువులు చదువుకోవాలన్నా.. వీరికి కృష్ణానది దాటడం మినహా మరో మార్గం లేదు. అయితే పాలకులు ఓట్ల సమయంలో గ్రామానికి వచ్చి మీ గ్రామా నికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల హామీ ఇచ్చి వెళ్లి పోయేవారు కానీ.. బ్రిడ్జి నిర్మాణం మాత్రం చేపట్టలేదు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధి కారంలోకి వచ్చిన తర్వాత 2018లో అప్పటి ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.12.37కోట్ల మంజూరు చేసింది. 2019లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత వనపర్తి ఎమ్మెల్యే ఈ పనులు దక్కించుకొని గద్వాలకు చెందిన వారికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. వారు పనులు ప్రారంభించారు. పనులు నత్తనడకన చేస్తుండడంతో అధికారులు పాత కాంట్రాక్టర్ను తొలగించి ఎస్ఆర్సీ అనే సంస్థకు పనులు అప్పగించారు. అయినా పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. దీంతో గ్రామస్తులకు తిప్పలు తప్పడం లేదు.
పనులు ప్రారంభమై ఏడు సంవత్సరాలు కావస్తున్నా గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణ పనులు పిల్లర్లకే పరిమిత మయ్యాయి. బ్రిడ్జి నిర్మాణాన్ని 33 పిల్లర్లతో నిర్మిస్తు న్నారు. 600 మీటర్ల పొడవు, 5.2 మీటర్ల వెడల్పు తో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. పిల్లర్లు మధ్యలో ఇంకా ఆరు పిల్లరు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. గ్రామ చివర మూడు పిల్లర్లు ప్రాథమిక దశలో ఉన్నాయి.
వేసవి కాలం ప్రారంభమైనా పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. వేస వి ముగింపు ఇంకా మూడు నెలలు మాత్రమే ఉంది. ఈ మూడు నెలలో కాలంలో ఆరు పిల్లర్లను పూర్తి స్థాయి లో నిర్మాణం చేయాల్సి ఉంటుందని, మూడు నెలల్లో ఆ పనులు పూర్తి అవుతాయన్న నమ్మకం గ్రామస్తులకు కలు గడం లేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న పనులను బట్టి చూస్తే ఎవరికైనా ఇదే అర్థమవుతుంది. దీనికి తోడు పిల్లర్లపై రోడ్డు దిమ్మెలు నిలబెట్టడానికి అడ్డ బీములు పో యాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 8 పిల్లరకు మాత్రమే అడ్డ బీములు పోశారు. ఇంకా 25 పిల్లర్లకు పోయాల్సి ఉం ది.
అయితే అక్కడ పనులను బట్టి చూస్తే ఈ ఏడాది కూడా గ్రామస్తులకు బ్రిడ్జి నిర్మాణమై అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీంతో వరదలు నిలిచి పోయినా సమయంలో గ్రామస్తులు నదిలో మట్టిరోడ్డు వేసుకొని రాక పోకలు కొనసాగిస్తున్నారు. వానకాలం ప్రారంభ మయ్యే నాటికి వారికి అవసరమైన సరుకులు, ఎరువులు ఇక్కడి నుంచి గ్రామంలోకి తీసుకెళ్తున్నారు. వానకాలం ప్రారంభమైంది అంటే పుట్టి ప్రయాణమే దిక్కు. వాన కాలంలో ఏమైన అవసరం ఉన్న గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పుట్టిలో బీరెళ్లి వైపు వెళ్లి అక్కడ నుంచి గద్వాలకు చేరుకుంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12.37 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు టెండర్ పిలిచింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో పనులు చేయకపోవడంతో బ్రిడ్జి నిర్మాణ వ్యయం పెరిగింది. గతంలో 600 టన్నుల స్టీలుకు బదులు ప్రస్తుతం 1200 టన్నులకు పెరిగినట్లు తెలిసింది. దీంతో అధికారులు రూ.32 కోట్లకు అంచనా వేసి పంపించగా ప్రభుత్వం దానిని రూ.29కోట్లు మంజూ రు ఇచ్చినట్లు తెలిసింది.
ఈ నిధులు విడుదలకు సంబ ంధించి కాంట్రాక్టర్కు ఎటువంటి ఆదేశాలు రాకపో వడంతో పనులు చేయడానికి వెనుకంజ వేస్తు న్నారు. గత ప్రభుత్వం విడుదల చేసిన నిధుల తోనే ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణం చేపట్టా రు. ఇంకా మధ్యలో ఆరు పిల్లర్లతో పాటు పిల్లర్లపై అడ్డ భీము లు, పిల్లర్లపై రోడ్డు దిమ్మెలు నిలబెట్టాలి, వాటికి ఇంకా ప్ర భుత్వం నిధులు విడుదల చేయ లేదు. దీంతో కాంట్రాక్టర్ పనులు చేస్తే బిల్లులు వస్తాయో లేదే అనే అనుమానంతో పనులపై అంత ఆసక్తి చూపు తున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం కాంట్రాక్టర్ కు సుమారు రూ.50లక్షల వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లిం చాల్సి ఉందని తెలిసింది.
రెండు నుంచి మూడు సంవత్స రాల్లో పూర్తి కావాల్సిన పనులు ఏడు సంవత్సరాలైనా పూర్తికాక పోవడంతో ప్రస్తుత ప్రభుత్వ తీరును గుర్రంగడ్డ గ్రామస్తులు ఎండగడుతున్నారు. ఉమ్మడి జిల్లా వాసి ముఖ్యమంత్రి అయినందున తమ బ్రిడ్జి పనులు వేగవంతంగా పూర్తి అవుతాయని అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా పనుల్లో పురోగతి లేకపోవడం తమకు బాధకలిగిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.