మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 26 : మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా కుష్బూగుప్తాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన విజయేందిరబోయి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల యాల సంస్థ సెక్రటరీ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కమిషనర్‌గా బదిలీఅయ్యారు. నూతన కలెక్టర్ కుష్బూగుప్తా స్వస్థలం పంజాబ్‌లోని బర్నాలా జిల్లా బదోర్ గ్రామం. తండ్రి విపిన్, తల్లి మంజూ. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్, ఎంటెక్ చేశారు.
ప్రజలకు దగ్గర ఉండి సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండోసారి 2018 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆల్ ఇండియా 80వ ర్యాంకు సాధించి తన కల నెరవేర్చుకున్నారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ అందుకున్నారు. వివాహం కారణంగా తెలంగాణ కేడర్‌కు బదిలీ అయ్యారు. 2022లో తెలంగాణ క్యాడర్ ఐఏఎస్‌గా నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. ఆపై 2023లో ఆదిలాబాద్ జిల్లాకు అసిస్టెంట్ కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో)గా కొనసాగుతూ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీపై అందుకున్నారు.
కుష్బూ గుప్తా ఢిల్లీ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక మైక్రోసాప్ట్లో నెలకు రూ.లక్ష వేతనం పొందే ఉద్యోగం వచ్చినా అందులో చేరలేదు. ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేయాలనే ఆశయంతో ఐఏఎస్ సాధించారు. లక్ష్యాలవైపు పయనించారు.
నిత్యం జనంలో ఉండే అధికారిణిగా కుష్బూ గుప్తా క్షేత్రపర్యటనలతో సమస్య మూలాలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తారనే పేరుంది. ఆదివాసీలు, విద్యార్థినులు, గిరిపుత్రలు రక్తహీనత అధిగమించేలా ‘గిరిపోషణ’, పదిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ‘మిషన్ లక్ష్యం’. కొలువు సాధించాలనుకునేవారికి పోటీ పరీక్షలపై శిక్షణ ఇప్పించారు. మహిళల ఉపాధికి స్వయం సహాయక సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ ఆర్థిక సాధికారత దిశగా మహిళలను నడిపించారు. ఈ దిశగా పాలమూరులోనూ విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు పెద్దపీట వేస్తుందనే ఆశిద్దాం.
మహబూబ్‌నగర్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శివేంద్రప్రతాప్ హైదరాబాద్ మెట్రో రైల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా డీఆర్వోగా పనిచేస్తున్న జేఎల్బీ హరిప్రియ మహబూబ్‌నగర్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.