Udit Narayan Kiss Contravesry | సింగర్ ఉదిత్ నారాయణ్(Udit Narayan) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన గాత్రంతో బాలీవుడ్ సినిమాలకు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు అందించాడు. బాలీవుడ్లో వీర్ జారా, జో జీతా వహి సికందర్, స్వదేశ్, దిల్ సే, దిల్ తో పాగల్ తదితర మ్యూజికల్ హిట్లను అందించాడు. తెలుగులో కూడా ఈ సింగర్ ‘అందమైన ప్రేమరాణి’, ‘అందాల ఆడబొమ్మ’, ‘కీరవాణి రాగంలో’, ‘పసిఫిక్‌లో దూకేమంటే’, ‘అమ్మాయే సన్నగా’ వంటి సూపర్ హిట్ పాటలు పాడి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
అయితే రీసెంట్గా ఉదిత్ నారాయణ్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించగా.. ఇందులో ఉదిత్ చేసిన పని ప్రస్తుతం వివాదంగా మారింది. కన్సర్ట్‌లో భాగంగా.. ఒక మహిళ అభిమాని సెల్ఫీ తీసుకుందామని ఉదిత్ దగ్గరికి వెళుతుంది. అతడితో సెల్ఫీ దిగిన అనంతరం చెంపపై ముద్దు పెడుతుంది. దీంతో ఉదిత్ కూడా ఆ అభిమానికి ఏకంగా లిప్ కిస్ ఇవ్వడంతో లేడి ఫ్యాన్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన తర్వాత మరికొంతమంది మహిళ అభిమానులు రాగా.. వాళ్లకి కూడా తన ముద్దులతో షాక్ ఇచ్చాడు సింగర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
ఉదిత్ నారాయణ్‌కి ఇలా చేయడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా.. సింగర్స్ అల్కా యాగ్నిక్, శ్రేయా ఘోషల్లకి ఇలానే చెంప మీద ముద్దు పెట్టి షాక్ ఇచ్చాడు. అయితే ఘటనలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అనుమతి లేకుండా అలా ఎలా ముద్దు పెడతాడని కామెంట్లు చేస్తున్నారు.
WTF! what is Udit Narayan doing 😱 pic.twitter.com/Rw0azu72uY
— Abhishek (@vicharabhio) January 31, 2025
Who is responsible – the audience or the artist?#uditnarayan #udit #EventPlanning pic.twitter.com/tzvn4p5Oyf
— Manie Singh ☬ 🇮🇳 (@manieofficial) February 1, 2025