KTR : రాష్ట్రంలో రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడేనా..?’ అని ఆయన ప్రశ్నించారు. ఇండ్లు కూలగొట్టకుండా కూడా మూసీని అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఇల్లు కట్టలేదుగానీ ఉన్న ఇండ్లు కూలగొడుతున్నాడని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలోనే రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ అంతటా నీటి శుద్ధీకరణ ప్లాంట్లు కట్టామని కేటీఆర్ గుర్తుచేశారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా నాగోల్లో మూసీని అభివృద్ధి చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వల్ల ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులతో మాట్లాడి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.