Karnataka | పాన్ మసాలా, గుట్కాపై ఏడాదిపాటు నిషేధం విధించిన కర్ణాటక
Karnataka : రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. పొగాకు, నికోటిన్ ఉన్న పాన్ మసాలా, గుట్కాలపై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయించడం, రవాణా, పంపిణీ చేయడం కూడా నేరమే.
Karnataka : రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. పొగాకు, నికోటిన్ ఉన్న పాన్ మసాలా, గుట్కాలపై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తరఫున ‘ద ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (ఎఫ్డీఏడీ)’ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయించడం, రవాణా, పంపిణీ చేయడం కూడా నేరమే. ఎఫ్డీఏడీకి చెందిన అధికారులు తయారీదారులపై నిఘా పెడతారు.
తయారీ సంస్థల్లో తనిఖీలు, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయాలపై ఇకపై నిషేధం ఉన్నందున అధికారులు తనిఖీలు చేసి, నోటీసులు జారీ చేస్తారు. జరిమానా కూడా విధిస్తారు. ఈ నిషేధం ఆగష్టు 10, 2026 నుంచి ఏడాది పాటు అమలులో ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2026 లోని సెక్షన్ 30(2)(ఏ)తోపాటు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్రొహిబిషన్ అండ్ రెస్ట్రిక్షన్స్ సేల్స్) రెగ్యులేషన్స్, 2011 యాక్ట్ ప్రకారం ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిషేధిత ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు సంబంధిత అధికారులకు తెలియజేయాలి. నిషేధం కాని ఉత్పత్తుల విషయంలో కూడా కర్ణాటక ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది.
ప్రతి ఉత్పత్తిదారుడు ప్యాకేజింగ్‌లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలు పాటించాయి. పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్ లేదా ప్లాస్టిక్ సంబంధిత మెటీరియల్ వాడకూడదు. పేపర్, పేపర్ బోర్డ్, సెల్యులోజ్, ఇతర సహజ ఉత్పత్తులు మాత్రమే వాడాలి. ప్లాస్టిక్, సింథటిక్ పాలిమర్, కో పాలిమర్స్, ల్యామినేట్స్ వాడకూడదు. అల్యూమినియం ఫాయిల్స్, మెటలైజ్డ్ లేయర్స్ కూడా వాడకూడదు. టిన్ అండ్ గ్లాస్ కంటైనర్స్ మాత్రం వాడొచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

