Kinnar Akhara – Mamta Kulkarni | ఉత్తరప్రదేశ్(UP) ప్రయాగ్‌రాజ్(Prayagraaj)లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మాజీ నటి మమతా కులకర్ణి(Mamta Kulkarni) సన్యాసం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 24న మహాకుంభమేళాకు వెళ్లిన ఆమె మహామండలేశ్వర్ (Mahamandelshwar)గా మారుతున్నట్లు ప్రకటించింది. తన జీవితం దేవుడికి అంకింతం ఇస్తూ.. ఇక నుంచి ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించాలి అనుకుంటున్నా అంటూ చెప్పుకోచ్చింది. ఈ సందర్భంగా తన పేరును శ్రీ యామై మమత నందగిరిగా మార్చుకుంది.
అయితే ఈ విషయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక నటిని కిన్నార్ అఖారాలో చేర్చుకోవడమే పెద్ద విషయం అంటే.. ఆమెకి మహామండలేశ్వర్ (Mahamandelshwar) లాంటి బిరుదు ఇవ్వడం ఏంటి అని కిన్నార్ సభ్యులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో ఆమెను కిన్నారు ఆఖారా నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. అలాగే మహామండలేశ్వర్‌గా తీసుకున్న ఆమె దీక్షను రద్దు చేశారు. కులకర్ణితో పాటు ఆమెను అఖారాలో చేర్పించిన ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి (Laxmi Naarayan Tripathi)పైనా కూడా బహిష్కరణ విధించారు.
1990లో తన గ్లామరస్ రోల్స్‌తో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది ఈ నటి. అయితే తన కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్(Under world DOn Chota Raajan)తో కులకర్ణికి సంబంధం ఉంది అనే వార్తలు బయటకు వచ్చాయి. దీంతో మమతా యాక్టింగ్ కెరీర్ నుంచి దూరంగా విదేశాలకు పారిపోయింది. భారత్ నుంచి వెళ్లిన దాదాపు 16 ఏండ్ల అనంతరం కెన్యాలో 2016లో జరిగిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఆమె పేరు బయటపడింది. రూ. 2000 కోట్ల విలువైన మాదకద్రవ్యాల రాకెట్‌ను మమతా భర్త విక్కీ గోస్వామి (Vicky Goswamy) నడిపిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో విక్కీ గోస్వామితో పాటు మమతాను అరెస్ట్ చేశారు కెన్యా పోలీసులు. ఇదే కేసుపై ఇండియాలో కూడా ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఈ కేసులో 2017లో బెయిల్ మీద బయటకు వచ్చింది మమతా. ఈ ఘటన జరిగిన అనంతరం దాదాపు 8 ఏండ్ల తర్వాత కుంభమేళలో దర్శనమిచ్చింది నటి. అయితే మమతా సన్యాసిగా మారడం అనేక అనుమానాలకు దారి తీసిన విషయం తెలిసిందే. తన భర్త మీద.. తన మీద ఉన్న డ్రగ్స్ కేసు నుంచి పూర్తిగా బయటపడడానికే మమతా సన్యాసం నాటకం వేస్తుందని వార్తలు బయటికి వచ్చాయి.