పెద్దపల్లి : కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో(Union Budget) యువతకు(Youth) ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం విమర్శించారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై స్పందించారు. ఈ బడ్జెట్లో రైతులు, పేదలు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు పెట్టి యువతను మళ్లీ మోసం చేశారన్నారు. మోదీ గ్యారెంటీల్లో ఈ పది సంవత్సరాలు చూస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల చొప్పున 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.
ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నవాటినే తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ బడ్జెట్ను చూస్తే యువతపై సవతి తల్లి ప్రేమ కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే బడ్జెట్ను రూపొందించారని, ఇది సామాన్యులకు ఎలాంటి మేలు చేయదన్నారు.
ఇవి కూడా చదవండి..