Shashi Tharoor : కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ఇవాళ పార్లమెంట్ (Parliament) లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) స్పందించారు. మధ్య తరగతికి ప్రయోజనం చేకూరేలా పన్ను శ్లాబుల్లో మార్పులు చేయడాన్ని మెచ్చుకుంటూనే.. మరి నిరుద్యోగుల (Unemployees) కు ఈ జీరో పన్ను (Zero tax) తో కలిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 75 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా నిరుద్యోగం, ద్రవ్యోల్బం ఊసు ఎత్తలేదెందుకు..? అని ఆయన క్వశ్చన్ చేశారు.
‘ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలపై పన్నులు తగ్గించడాన్ని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. బడ్జెట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొత్త పన్ను పాలసీతో మధ్యతరగతి ప్రజలకు మేలు చేయడం మంచి విషయమే. మరి కరెక్టుగా ఆలోచిస్తే.. మీకు వేతనం వస్తున్నట్లయితే మీరు మీరు చెల్లించే గతంలో కంటే తగ్గుతుంది. కానీ నా ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే.. మరి మీకు ఉద్యోగమే లేకపోతే తగ్గిన పన్నుతో ఏం లాభం..?’ అని ప్రశ్నించారు. ‘మీకు ఉద్యోగం ఉండి, ఏడాదికి రూ.12 లక్షల కంటే తక్కువ వేతనం ఉంటే.. సంతోషించదగ్గ విషయమే. మరి నిరుద్యోగుల సంగతేంటి..?’ అని నొక్కినొక్కి ప్రశ్నించారు.
‘ప్రధాన సమస్యలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంశాలను ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదు. ఆమె పూర్తి ప్రసంగంలో ఎక్కడా ఆ రెండు పదాలు కనిపించకపోవడం విచారకరం. కేంద్ర బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు లేదని, ఎన్నికల్లో పొందే ఓట్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు, బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు చేశారని విమర్శించారు.
Road accident | అదుపుతప్పి కాలువలో పడ్డ వాహనం.. ఏడుగురు దుర్మరణం
Viral Video | రైల్లో టీటీఈ లంచావతారం.. వీడియో తీస్తున్న ప్రయాణికుడికి వార్నింగ్
Mahakumbh | మహా కుంభమేళాలో 77 దేశాల దౌత్యవేత్తల బృందం సందడి.. Video
Anna Beatriz | పోర్న్ సీన్ షూటింగ్ అనంతరం బిల్డింగ్‌పై నుంచి పడి స్టార్ నటి మృతి..!
Custom duty | కేంద్ర బడ్జెట్.. 36 రకాల ఔషధాలపై 100 శాతం పన్ను మినహాయింపు
Income Tax | వేతన జీవులకు భారీ ఊరట.. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు