Road accident : వివాహ వేడుకకు వెళ్లిన 14 మందితో తిరిగివస్తున్న వాహనం అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. హర్యానా రాష్ట్రం (Haryana state) లోని ఫతేహాబాద్ జిల్లా (Fatehabad district) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
శుక్రవారం రాత్రి హర్యానాకు చెందిన 14 మంది పంజాబ్లో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వస్థలానికి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కాలువలో పడింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ముగ్గురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.
మిగతా ఇద్దరికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. శనివారం ఉదయం మరో ఆరు మృతదేహాలను వెలికితీశారు. ఇంకో ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుల్లో ఓ ఏడాదిన్నర పసిబిడ్డ, పదేళ్ల బాలిక ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Viral Video | రైల్లో టీటీఈ లంచావతారం.. వీడియో తీస్తున్న ప్రయాణికుడికి వార్నింగ్
Mahakumbh | మహా కుంభమేళాలో 77 దేశాల దౌత్యవేత్తల బృందం సందడి.. Video
Anna Beatriz | పోర్న్ సీన్ షూటింగ్ అనంతరం బిల్డింగ్పై నుంచి పడి స్టార్ నటి మృతి..!
Custom duty | కేంద్ర బడ్జెట్.. 36 రకాల ఔషధాలపై 100 శాతం పన్ను మినహాయింపు
Income Tax | వేతన జీవులకు భారీ ఊరట.. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు